హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీపై తేల్చేసిన వైఎస్ షర్మిల

By narsimha lodeFirst Published Jul 16, 2021, 1:16 PM IST
Highlights

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల గురించి వైఎస్ షర్మిల తేల్చేశారు. ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయని ఆమె ప్రశ్నించారు. పగలు ప్రతీకారాల కోసం వచ్చిన ఎన్నికల్లో తాము పోటీ చేయబోమన్నారు.
 

హైదరాబాద్: హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ లో ఆమె శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ ఎన్నికలతో  ఏమైనా ప్రజలకు ఉపయోగం ఉందా అని ఆమె ప్రశ్నించారు. పగలు,ప్రతీకారాలతో వచ్చిన ఎన్నికలుగా ఆమె పేర్కొన్నారు.

also read:చేవేళ్ల నుండి పాదయాత్ర: తేల్చేసిన షర్మిల

హుజూరాబాద్ ఎన్నికలు ఇప్పుడు అవసరమా అని ఆమె ప్రశ్నించారు.హుజూరాబాద్ ఉప ఎన్నికతో ఏం వస్తోందని  ఆమె అడిగారు.రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే హుజూరాాబాద్‌లో పోటీ చేస్తామన్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నికలకు అర్ధమే లేదన్నారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగానే హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎందుకు వచ్చాయని తనతో పాటు ఉన్న పార్టీ నేతలను ఆమె నవ్వుతూ ప్రశ్నించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలు వచ్చిన తీరుపై ఆమె సెటైరికల్ గా స్పందించారు.ఈ ఎన్నికలతో ప్రజలకు ఏం ఒరుగుతోందని ఆమె ప్రశ్నించారు. ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉంటే  పోటీ చేసేందుకు తాము సిద్దమని ఆమె చెప్పారు. 
 

click me!