చెవెళ్ల పాప కోసం ఓఎన్జిసి

First Published Jun 24, 2017, 12:51 PM IST
Highlights

బోరుబావిలో పడిన చిన్నారి మీనా ఆచూకీ ఇంకా లభించలేదు. ఆమె పడిపోయి 40 గంటలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం అందలేదు. సహాయకరచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. తాజాగా ఓఎన్జీసి అధికారులు రంగంలోకి దిగి పాప ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

బోరుబావిలో పడిన చిన్నారి మీనా ఆచూకీ ఇంకా లభించలేదు. ఆమె పడిపోయి 40 గంటలు గడుస్తున్నా ఎలాంటి సమాచారం అందలేదు. సహాయకరచర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వర్షం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది. తాజాగా ఓఎన్జీసి అధికారులు రంగంలోకి దిగి పాప ఆచూకీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

 

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లి గ్రామంలో బోరుబావిలో పడిన చిన్నారి మీనా ను రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. చిన్నారిని రక్షించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ కోసం ఘటనాస్థలికి ఓఎన్‌జీసీ బృందం చేరుకుంది.

 

ఎన్డీఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి తదితర రెస్క్యూ టీంలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. తాజాగా ఓఎన్జీసీ అధికారులు కూడా బోరుబావి వద్దకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అత్యాధునిక మాట్రిక్స్ కెమెరా సాయంతో మీనా ఎంత లోతులో ఉందోనని ఓఎన్జీసీ నిపుణులు పరిశీలిస్తున్నారు.

 

రాత్రి 2గం. సమయంలో ఒక టీం వచ్చి కెమెరాతో ప్రయత్నించగా 200 అడుగుల వరకు ఎలాంటి సమాచారం లభించలేదు. పాప మట్టిలో కూరుకుపోయినట్లు భావిస్తున్నారు. బోరుబావిలోకి నీళ్లు రావడంతో కెమెరాల్లో చిత్రాలు నిక్షిప్తం కావటం లేదని అధికారులు అంటున్నారు. మరోవైపు బోరుబావికి పక్కన సమాంతరంగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. 108 సిబ్బంది నిరంతరం బోరు బావిలోకి ఆక్సిజన్ ను పంపిణీ చేస్తున్నారు.

 

రవాణా మంత్రి మహేందర్ రెడ్డి,  కలెక్టర్ రఘునందన్ రావు దగ్గరుండి సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. తాజా పరిణామాలను సిఎం కెసిఆర్ కు మంత్రి మహేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు.

 

పాపా చిన్నారి 215 అడుగుల లోతురో ఉన్న ట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

 

సాయంత్రానికి ఫలితాలు వచ్చే అవ అవకాశం ఉందని ప్రకటించిన మంత్రి మహేందర్ రెడ్డి.

 

వాటర్ ప్రూఫ్ కెమరాలతో పాప ఆచూకి తెలుసుకుపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

 

మండలి చైర్మన్ స్వామి గౌడ్,  ఎంఎల్సీ పట్నం నరేందర్ రెడ్డి,  ఎంఎల్ఏలు యాదయ్యలు సహాయక చర్యల్లో పాల్గొన్న రు.

click me!