జీహాదిగా మారిన సుబ్రమణ్యం

First Published Jun 24, 2017, 8:46 AM IST
Highlights

అతడు పుట్టింది హిందూమతంలో. కానీ మతం మార్చుకున్నాడు. అతడి పేరు సుబ్రమణ్యం కానీ పేరు మార్చుకున్నాడు. మారణహోమానికి  తెగబడాలనుకున్నాడు. సీన్ కట్ చేస్తే జైలుపాలయ్యాడు.

 

అతడు పుట్టింది హిందూమతంలో. కానీ మతం మార్చుకున్నాడు.

అతడి పేరు సుబ్రమణ్యం కానీ పేరు మార్చుకున్నాడు.

మారణహోమానికి  తెగబడాలనుకున్నాడు.

సీన్ కట్ చేస్తే జైలుపాలయ్యాడు.

 

హైదరాబాద్‌ సహా దేశంలోని పలుచోట్ల భారీ పేలుళ్లకు కుట్రపన్నిన ఐఎస్‌ ఉగ్రవాదిని హైదరాబాద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. అతడి పేరు కొనకళ్ల సుబ్రమణ్యం అలియాస్‌ ఒమర్‌ (22). కృష్ణా జిల్లా చల్లపల్లి మండలానికి చెందిన సుబ్రమణ్యం ఇస్లాం వైపు ఆకర్షితుడయ్యాడు.

 

2014లో హిందూ మతం నుంచి ముస్లిం మతంలోకి మారిపోయాడు. ముస్లిం ఆచార సంప్రదాయాలను అలవాటు చేసుకున్నాడు. అనంతరం గుజరాత్‌ చేరి కొద్దికాలం మత గ్రంథాలు చదివాడు. శ్రీనగర్‌, ఉమ్రాబాద్‌, తమిళనాడులోని అంబుర్‌, ముంబై తదితర ప్రాంతాలు తిరుగుతూ మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

 

ఫేస్‌బుక్‌, వాట్సప్‌, టెలిగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలు, మెసెంజర్‌ సర్వీసుల ద్వారా ఉగ్రవాద సంస్థ ఐసిస్  తో సంబంధాలు నెరిపాడు. వారితో తరచూ సంభాషించేవాడు. ఇక్కడ తాను చేయాల్సిన పనుల గురించి తెలుసుకునేవాడు. ముంబై ఐఎస్‌ మాడ్యూల్‌కు చెందిన అబు కుఫ్హాతో టెలిగ్రామ్‌ ద్వారా తరచూ సంభాషిస్తూ దేశంలో మారణహోమం సృష్టించేందుకు సిద్ధమయ్యాడు.

 

ఐఎస్‌ మాడ్యూళ్లపై నిఘా పెట్టిన పోలీసులకు సుబ్రమణ్యం వివరాలు కూడా తెలిశాయి. కానీ వారు తొందరపడకుండా అన్ని ఆధారాలూ సేకరించేందుకు అతడిపై నిఘాను కొనసాగించారు. అతడు విధ్వంస కార్యకలాపాల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్నట్లు గుర్తించి అరెస్టు చేశారు.

 

హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో పేలుళ్లకు కుట్రపన్నిన ఒమర్‌ వారం రోజుల క్రితం రాజధానికి చేరాడు. టోలిచౌకిలోని సోఫియా రెసిడెన్సీ మూడో అంతస్తు రూమ్‌ నెంబరు 302లో అమర్‌ అనే అంగవికలుడి వద్ద వంటమనిషిగా చేరాడు. రెండు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిన ఒమర్‌ తిరిగి రాకపోవటంతో ఆ ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యాడు.

 

అంతలోనే.. సిట్‌ ఏసీపీ డి.హరికుమార్‌ యాదవ్‌, ఇన్‌స్పెక్టర్‌ కె.శ్యామలరావు శుక్రవారం ఉదయం 8 గంటలకు కొనకళ్ల సుబ్రమణ్యం అలియాస్‌ ఒమర్‌ను అరెస్ట్‌ చేశారు. అతణ్ని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించినట్లు అడిషనల్‌ సీపీ(సిట్‌, క్రైమ్‌) వివరించారు.

 

శిక్షణ కోసం దేశం దాటి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలోనే ఒమర్‌ను అరెస్ట్‌ చేసినట్లు సమాచారం. కాగా.. ఒక హిందు మతంలో పుట్టి మతం మార్చుకుని మారణహోమం చేసేందుకు తెగబడ్డ వాడి తీరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

click me!