తెలంగాణ నిరుద్యోగులకు ఇంకో శుభవార్త

First Published Sep 6, 2017, 2:47 PM IST
Highlights

కొండాలక్ష్మణ్ ఉద్యానవర్శిటీలో 80 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

భారీగా అప్లికేషన్ ఫీజులు వసూలు చేస్తున్న వర్శిటీ

దరఖాస్తు ఫీజే రూ.2వేలుగా నిర్ణయించిన వర్శిటీ

తుదకు ఎస్సీ, ఎస్టీలకు 750 వసూళు

షాక్ కు గురవుతున్న నిరుద్యోగులు

తెలంగాణ నిరుద్యోగులకు సర్కారు ఇంకో తీపి కబురు వినిపించింది. తాజాగా శ్రీ కొండా లక్ష్మణ్‌ ఉద్యానవన వర్సిటీలో 80 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ అయింది. ప్రకటించిన 80 పోస్టుల్లో 6 ప్రొఫెసర్‌, 26 అసోసియేట్‌ ప్రొఫెసర్‌, 48 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తుల చేరడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 3 అని ప్రకటించింది వర్శిటీ.


– ప్రొఫెసర్-6 పోస్టులు విభాగాలవారీగా ఖాళీలు:
– ఫ్లోరి కల్చర్- 2, ఫ్రూట్ సైన్స్- 1, పీఎస్‌ఎంఏ-1, వెజిటబుల్స్- 2
–అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి. రిసెర్చ్ పేపర్/బుక్స్‌లో 10 పబ్లికేషన్స్ ప్రచురితమై ఉండాలి. టీచింగ్ లేదా రిసెర్స్‌లో కనీసం ఏడు లేదా ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
– పే స్కేల్: రూ. 37,400-67,000+ అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,000/-

– అసోసియేట్ ప్రొఫెసర్-26 పోస్టులువిభాగాలవారీగా ఖాళీలు:
– బయోకెమిస్ట్రీ-1, క్రాప్ ఫిజియాలజీ-2, ఎంటమాలజీ- 1, ఫ్లోరికల్చర్-3,ఫ్రూట్ సైన్స్-7, జీపీబీఆర్- 2, ప్లాంట్ పాథాలజీ-1, పీఎస్‌ఎంఏ-3, స్టాటిస్టిక్స్-1, వెజిటబుల్ సైన్స్-5
– అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీతోపాటు పీహెచ్‌డీ చేసి ఉండాలి. రిసెర్చ్ పేపర్స్ లేదా బుక్స్‌లో కనీసం ఐదు పబ్లికేషన్స్ ప్రచురితమై ఉండాలి. దీంతోపాటు బోధన లేదా రిసెర్చ్‌లో ఏడు లేదా ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
– పే స్కేల్: రూ. 37,400-67,000+ అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,000 /-

– అసిస్టెంట్ ప్రొఫెసర్-48 పోస్టులువిభాగాలవారీగా ఖాళీలు:
– అగ్రికల్చర్ ఎకనమిక్స్-2, అగ్రికల్చర్ ఇంజినీరింగ్-2, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్-2, ఆగ్రానమీ-2, బయోకెమిస్ట్రీ-1, క్రాప్ ఫిజియాలజీ-2, ఎంటమాలజీ-4, ఫ్లోరికల్చర్-4, ఫ్రూట్ సైన్స్-6, జీపీబీఆర్-2, ప్లాంట్ పాథాలజీ-4, పీఎస్‌ఎంఏ-4,ఎస్‌ఎస్‌ఏసీ-3, స్టాటిస్టిక్స్-2, వెజిటబుల్ సైన్స్-7
– అర్హత: గుర్తింపు పొందిన అగ్రిలక్చర్ యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీతోపాటు 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ లేదా హార్టికల్చర్/ఐైల్లెడ్ సైన్సెస్ సబ్జెక్ట్‌లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అర్హతను సాధించాలి. ప్రాంతీయ/తెలుగు భాషలో పరిజ్ఞానం ఉండాలి.
– పే స్కేల్: రూ. 15,600-39,100 + అకడమిక్ గ్రేడ్ పే రూ. 6,000/-

– అప్లికేషన్ ఫీజు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు జనరల్/బీసీ అభ్యర్థులు రూ. 1500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 750/-చెల్లించాలి.
– అసోసియేట్ ఫ్రొఫెసర్/ ప్రొఫెసర్ పోస్టులకు జనరల్/బీసీ అభ్యర్థులు రూ. 2000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 1000/-చెల్లించాలి. ఫీజును కింది అడ్రస్‌కు చెల్లించాలి.ది రిజిస్ట్రార్, ది కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, రాజేంద్రనగర్ (హైదరాబాద్)లో చెల్లించే విధంగా డిమాండ్ డ్రాఫ్టు (డీడీ) తీయాలి.

– ఎంపిక విధానం: సెల్ఫ్ అసెస్‌మెంట్ స్కోర్ కార్డు (అకడమిక్ మార్కులు)కు 75 మార్కులు, ఇంటర్వ్యూకు 25 మార్కులు.
– దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తును పూర్తిగా నింపి, సంబంధిత సర్టిఫికెట్లను, డీడీని జతచేసి కింది అడ్రస్‌కు పంపించాలి.
చిరునామా: REGISTRAR Sri Konda Laxman Telangana State Horticultural University Rajendranagar, Hyderabad – 500 030
– దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 3


– వెబ్‌సైట్:

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!