హైదరాబాద్ లో పగలే... చీకటి పడింది

Published : Sep 06, 2017, 10:55 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
హైదరాబాద్ లో పగలే... చీకటి పడింది

సారాంశం

హైదరాబాద్ లో భారీ వర్షం, నగరమంతా మేఘావృతం. పొద్దనే చీకటి

నిన్నంతా ఎండలో ఎండిన  హైదరాబాద్ లో  ఈ రోజు పొద్దనే చీకటిపడింది. నల్లటి మబ్బులు నగరాన్ని కమ్మేశాయి. పగలే చీకటి పడింది.. తెల్లవారుజాము నుంచే ఈ పరిస్థితి ఏర్పడింది.  ఆకాశం పూర్తిగా దట్టమయిన  మేఘాలు అవరించి ఉండటంతో భారీగావర్షం కురసబోతున్నదని తెలిసిపోయింది. వృతంగా మారింది.ఎపుడు లిన విధంగా పొద్దు పొడవనే లేదు. వాహనదారులు అయితే లైట్లు వేసుకుని వెళ్లటం కనిపించింది.10 గంటల సమయంలో మరీ చీకటి ఆవరించింది. వర్షంమొదలయింది. సిటీలో అక్కడక్కడ సన్నటి జల్లులు,వర్షం,  పడుతోన్నది. వాతావరణ శాఖ భారీ హెచ్చరిక చేసింది.జిహెచ్ ఎంసి యంత్రాంగాన్నిఅప్రమత్తం చేసింది. హయత్ నగర్, ఎల్ బినగర్, వనస్థలిపురం, ఉప్పల్ ప్రాంతాలలో వర్షం కురుస్తున్నది. నగర శివార్లలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. వరంగల్ అర్బన్, భూపాలపల్లి జిల్లాల వ్యాప్తంగా భారీ వర్షం కురిస్తున్నట్లు సమాచారం అందింది. నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిస్తున్నది. ఒరిస్సా నుంచి అల్పపీడనద్రోణి ఇటు వైపు కదలడంతో వాతావరణంలో ఈ అనూహ్య  మార్పు వచ్చిందని చెబుతున్నారు.

పోతే, వర్షంలోనే హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం కొనసాగుతూ ఉంది. వందల సంఖ్యలో విగ్రహ వాహనాలు ట్యాంక్ బండ్ వైపు తరలివస్తున్నాయి. సంజీవయ్య పార్క్ 300 విగ్రహాలు పార్క్ చేసి ఉన్నారు. రెండుగంటల్లో నిమజ్జనం పూర్త వుతుంది. సిటిలో ఎక్కడా ప్రాబ్లమ్ లేదు. 34 క్రేన్ లు పనిలో ఉన్నాయి. రద్దీ వల్ల 300 వాహానాలను పార్క్ దగ్గర ఆపారు. అంతే, అని   జిహెచ్ ఎంసి కమిషన్ జనార్ధన్ రెడ్డి చెప్పారు.నిమజ్జనం రాస్తాలో శుభ్రం చేయడం కూడా పూర్తాయింది. 9700 మంది వర్కర్లతో రోడ్లను శుభ్రం చేయడం జరుగుతూ ఉందని ఆయన చెప్పారు.

 

 

 

 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!