ఒకే కుటుంబంలో ముగ్గురిపై విషం చిమ్మిన పాము

Published : Aug 24, 2019, 09:54 AM IST
ఒకే కుటుంబంలో ముగ్గురిపై విషం చిమ్మిన పాము

సారాంశం

 వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.  ఈ సంఘటన మహబూబాబాద్   జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎరచెక్రకు తండాలో చోటుచేసుకుంది.

ఓ కుటుంబంపై పాము పగపట్టింది. గాఢ నిద్రలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై పాము విషం చిమ్మింది. దీంతో ఆ ముగ్గురు పాముకాటుకి బలయ్యారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.  ఈ సంఘటన మహబూబాబాద్   జిల్లాలోని నర్సింహులపేట మండలం కొమ్ములవంచ శివారు ఎరచెక్రకు తండాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జాతోట్‌ రవి (38), అతని భార్య, కుమారుడు ఇంట్లో నిద్రిస్తుండగా ఐదడుగుల కట్లపాము గత రాత్రి ముగ్గురినీ కాటు వేసింది.  భర్త జాతోట్‌ రవి మృతి చెందగా.. భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. మహబూబాబాద్‌ ఏరియా ఆస్పత్రికి వారిని తరలించారు. కట్లపాము అత్యంత విషపూరితమైందని స్నేక్‌ క్యాచర్లు చెప్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే
School Holidays : ఈ గురువారం స్కూళ్ళకు సెలవేనా..? ఎందుకో తెలుసా?