చంపుదామని ప్లాన్ చేశారనే అనుమానంతో.. చంపేశాడు

By telugu teamFirst Published Aug 24, 2019, 7:44 AM IST
Highlights

వీరిలో శ్రీకాంత్‌ వీక్లీ ఫైనాన్స్‌ నిర్వహిస్తూ.. ఆటోలను అద్దెకిస్తుంటాడు. ఇటీవల ఐలయ్య అనే వ్యక్తితో భూ తగాదా రావడంతో అతడిని చంపేందుకు శ్రీకాంత్‌ ప్రయత్నించాడు. 

ఓ చిన్న వివాదం... మరో చిన్న మనస్పర్థ కారణంగా ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తనను  చంపుతాడేమో అనే అనుమానంతో... ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మియాపూర్‌ ఎంఏనగర్‌కు చెందిన ప్రవీణ్‌(24) ఆటోరిక్షా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వాణీనగర్‌లో ఉండే శ్రీకాంత్‌, అతడి బంధువులు శ్రీను, రాజేశ్‌ కూడా అదే ప్రాంతంలో ఆటోరిక్షా నడుపుతుంటారు. వీరిలో శ్రీకాంత్‌ వీక్లీ ఫైనాన్స్‌ నిర్వహిస్తూ.. ఆటోలను అద్దెకిస్తుంటాడు. ఇటీవల ఐలయ్య అనే వ్యక్తితో భూ తగాదా రావడంతో అతడిని చంపేందుకు శ్రీకాంత్‌ ప్రయత్నించాడు. 

ఆ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శ్రీకాంత్‌.. తనను చంపేందుకు ఐలయ్యతో చేతులు కలిపాడనే అనుమానంతో ప్రవీణ్‌ను హతమార్చేందుకు స్కెచ్‌ వేశాడు. వీక్లీ ఫైనాన్స్‌ నడిపే శ్రీకాంత్‌కు రాజేశ్‌ రూ. 10 వేలు బాకీ ఉన్నాడు. రాజేశ్‌ను బెదిరిద్దామంటూ ప్రవీణ్‌ వద్దకు వెళ్లిన శ్రీకాంత్‌.. అతడిని తొలుత బొల్లారం చౌరస్తాకు తీసుకెళ్లాడు. అక్కడ ప్రవీణ్‌, శ్రీనుతో కలిసి రాజేశ్‌ను పట్టుకొని ఆటోలో ధర్మపురి క్షేత్రానికి తీసుకెళ్లారు. రాజేశ్‌ను శ్రీను, ప్రవీణ్‌ పట్టుకోగా శ్రీకాంత్‌ వెనక నుంచి వచ్చి చున్నీతో ప్రవీణ్‌ మెడకు ఉరివేశాడు.

ప్రవీణ్‌ పెనుగులాడుతుండగా.. శ్రీను అతడి కాళ్లను గట్టిగా పట్టుకొని శ్రీకాంత్‌కు సహకరించాడు. శ్రీకాంత్‌ తనవెంట తీసుకెళ్లిన కత్తితో ప్రవీణ్‌ మొండెం నుంచి మెడను వేరు చేశాడు. మొండేన్ని అక్కడే పొదల్లో పారవేసి.. తలను బొల్లారంలోని ఆటోస్టాండ్‌ వద్ద పెట్టి పారిపోయాడు. విషయం తెలియని రాజేశ్‌ భయభ్రాంతులకుగురై పొదల్లోకి పారిపోయాడు.

 అతడి ద్వారా సమాచారం అందుకున్న స్థానికులు.. విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనాస్థలాన్ని మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, ఏసీపీ రవికుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్‌ సందర్శించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్‌, శ్రీనును అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది.

click me!