శంషాబాద్ లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం

Published : Aug 24, 2019, 07:57 AM IST
శంషాబాద్ లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం

సారాంశం

బాలికను కిడ్నాప్ చేస్తున్నాడనే అనుమానంతో అతనిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.  అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

శంషాబాద్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కి గురైంది. కాగా... తిరిగి క్షేమంగా ఇంటికి చేరింది. ఈ సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ లో చోటుచేసుకుంది. 

చిన్నారిని అపహరించిన రంజిత్‌సింగ్‌ అనే వ్యక్తిని స్థానికులు పట్టుకున్నారు. బాలికను కిడ్నాప్ చేస్తున్నాడనే అనుమానంతో అతనిని స్థానికులు పట్టుకొని చితకబాదారు.  అనంతరం పోలీసులకు సమాచారమిచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

వైద్య పరీక్షల నిమిత్తం  చిన్నారిని వారి కుటుంబసభ్యులకు అప్పగించనున్నారు. ఇప్పటికే చిన్నారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. తమ కుమార్తె క్షేమంగా ఉందన్న విషయం తెలియగానే... ఆమె తల్లిదండ్రులు సంబరపడిపోయారు. 
 

PREV
click me!

Recommended Stories

Liquor sales: మాములు తాగుడు కాదు సామీ ఇది.. డిసెంబ‌ర్ 31న‌ ఎన్ని కోట్ల బీర్లు, విస్కీ తాగారంటే
Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్