Hyderabad Accident:మాదాపూర్ లో బైక్ యాక్సిడెంట్... యువకుడి మృతి, సోదరుడికి గాయాలు

By Arun Kumar P  |  First Published Oct 3, 2021, 11:16 AM IST

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇద్దరు సోదరులు బైక్ పై మితిమీరిన వేగంతో వెళుతూ కారును ఢీ కొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. 


హైదరాబాద్: టాలీవుడ్ హీరో సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ గురించి మరువకముందే హైదరాబాద్ లో మరో ఘోర ప్రమాదం (Hyderabad Accident) చోటుచేసుకుంది. మితిమీరిన వేగంతో వెళుతున్న ఓ బైక్ మాదాపూర్ (Madhapur) వద్ద కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళుతున్న ఇద్దరు యువకుల్లో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి.  

ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.   తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం మల్కిపురం గ్రామానికి చెందిన గణేష్ రాజు, చైతన్య వర్మ అన్నదమ్ములు. వీరిద్దరు ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ కు వచ్చి బోరబండలోని పెదన్నాన్న ఇంట్లో వుంటున్నారు. గణేష్ పంజాగుట్టలోని ఎమిటి కాలేజీలో బిబిఎమ్ చదువుతుండగా చైతన్య శంకర్ పల్లిలోని ఐబిఎమ్ కాలేజీలో బిబిఎమ్ చేస్తున్నాడు. 

Latest Videos

undefined

అయితే నిన్న(శనివారం) వీకెండ్ కావడంతో సోదరులిద్దరు సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి బయట పార్టీచేసుకున్నారు. రాత్రి ఇంటికి తిరిగి వెళుతుండగా భాగ్యనగర్‌ సొసైటీ వద్ద పోలీసులు డ్రంక్ ఆండ్ డ్రైవ్ చేయడాన్ని గమనించారు. పోలీసుల నుండి తప్పించుకోడానికి అతివేగంగా బైక్ ను పోనిచ్చారు. దీంతో బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టింది.  

read more  హైదరాబాద్: మసాజ్ సెంటర్ పేరిట హైటెక్ వ్యభిచారం... గుట్టు రట్టు చేసిన పోలీసులు

ఈ ప్రమాదంలో బైక్ వెనకాల కూర్చున్న చైతన్య ఎగిరి రోడ్డుపై పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బైక్ ను డ్రైవింగ్ చేసిన గణేష్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. 

బైక్ ను ర్యాష్ గా డ్రైవ్ చేస్తూ వచ్చి తన కారును ఢీ కొట్టారంటూ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు విచారణ చేపట్టారు. యువకులు మద్యం సేవించి బైక్ ను డ్రైవ్ చేసి వుంటారని... అందువల్లే డ్రంక్ ఆండ్ డ్రైవ్ నుండి తప్పించుకునే ప్రయత్నం చేశారని అనుమానిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

click me!