హైదరాబాద్: మసాజ్ సెంటర్ పేరిట హైటెక్ వ్యభిచారం... గుట్టు రట్టు చేసిన పోలీసులు
బ్యూటీ స్పా సెంటర్ పేరిట హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు మహిళలు, ఓ విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
హైదరాబాద్: స్పా సెంటర్ పేరుతో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ ముఠా హైదరాబాద్ పోలీసులకు (Hyderabad Police) చిక్కింది. హైదరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ లో మసాజ్ సెంటర్ (Spa Center) ముసుగులో గుట్టుగా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడిచేసి మగ్గురు మహిళలతో పాటు నిర్వహకుడు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు.
వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ వెన్నెలగడ్డలో ఓ అపార్ట్ మెంట్ లో పర్సుల్ బ్యూటీ స్పా ఆండ్ సెలూన్ ను ఓ వ్యక్తి నిర్వహిస్తున్నాడు. అయితే స్పా సెంటర్ ముసుగులో విటులను ఆకర్షించి అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. కొంతకాలంగా సదరు స్పాకు అమ్మాయిలు, అబ్బాయిలు ఎక్కువగా వస్తుండటంతో అనుమానించిన స్థానికులు, అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
read more దంపతుల మధ్య గొడవ.. కిడ్నాప్‌కు దారి తీసిన వ్యవహారం
దీంతో సదరు స్పా సెంటర్ పై నిఘా వుంచిన పేట్‌బషీరాబాద్ పోలీసులు వ్యభిచారం జరుగుతున్నట్లు నిర్దారించుకున్నారు. దీంతో తాజాగా స్పాం సెంటర్ పై దాడిచేసి నిర్వహకుడితో పాటు ముగ్గురు మహిళలు, ఓ విటుడిని అరెస్ట్ చేశారు.