న్యూ ఇయర్.. రెండు గంటల్లో రూ.70కోట్ల మద్యం

By ramya neerukondaFirst Published Jan 2, 2019, 10:07 AM IST
Highlights

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. న్యూ ఇయర్ వేడుకల్లో నగర యువత మునిగితేలింది. ఇక మందుబాబుల గురించి అయితే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మందులో మునిగితేలిపోయారు.

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేశాం. న్యూ ఇయర్ వేడుకల్లో నగర యువత మునిగితేలింది. ఇక మందుబాబుల గురించి అయితే.. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మందులో మునిగితేలిపోయారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి సమయంలో మద్యం దుకాణాల సమయం పెంచడంతో.. మందుబాబుల్లో హుషారు పెరిగింది. వారి హుషారుతో పాటు.. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా పెరిగింది.

కేవలం డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం సుమారు రూ.70కోట్ల విలువచేసే మద్యం అమ్మకాలు జరిగాయి.  అది కూడా కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిదిలోనే కావడం గమనార్హం. 2017 డిసెంబర్ 31వ తేదీన రూ.60కోట్ల అమ్మకాలు జరగగా.. ఈ ఏడాది మరో రూ.10కోట్లు ఎక్కువగానే మద్యం అమ్మకాలు జరిగాయి.

ఇక మద్యం సేవించి పోలీసులకు చిక్కిన వారి సంఖ్య అయితే.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నగరంలోని చాలా ప్రాంతాల్లో.. మందుబాబులు.. డ్రంక్ డ్రైవ్ లో దొరికారు.  చాలా చోట్ల మోతాదుకి మించి మద్యం సేవించిన కొందరు.. రోడ్లపై నానా రభస చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. 

click me!