చలిపులి: ఈ రోజు,రేపు జాగ్రత్త అంటున్న వాతావరణశాఖ

By sivanagaprasad kodatiFirst Published Jan 2, 2019, 8:57 AM IST
Highlights

గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో లెగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉత్తర భారతం నుంచి వీస్తోన్న శీతల గాలులతో రెండు రాష్ట్రాల్లో చలి అంతకంతకూ పెరుగుతోంది. 

గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో లెగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతోంది. ఉత్తర భారతం నుంచి వీస్తోన్న శీతల గాలులతో రెండు రాష్ట్రాల్లో చలి అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు బుధ, గురువారాల్లో దీని తీవ్రత మరింత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.

శీతల గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి.  మంగళవారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌లో 5, మెదక్‌లో 6, రామగుండం, హన్మకొండ, హైదరాబాద్‌లలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట ఇవి మరింతగా దిగజారిపోయాయి.

చలి తీవ్రతకు తెలంగాణలో ఇద్దరు వృద్ధులు మరణించారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం గూడ గ్రామానికి చెందిన సదల లస్మన్న, జక్కుల గంగమ్మ చలి తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. మరోవైపు ఏపీలోనూ పరిస్థితి ఇలాగే ఉంది. చింతపల్లిలో మంగళవారం 2.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయలసీమలోని ఆరోగ్యవరంలో 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

click me!