‘‘తెలంగాణోడు పీఎం కావొద్దా’’ అంటూ వస్తాడు : కేసీఆర్‌పై రాములు నాయక్ వ్యాఖ్యలు

By sivanagaprasad kodatiFirst Published Jan 2, 2019, 8:21 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ రాములూ నాయక్. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ రాములూ నాయక్. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణోడు ప్రధాన మంత్రి కావాలా వద్ద అంటూ రెచ్చగొట్టి తెలంగాణ ప్రజలను మళ్లీ మోసం చేసేందుకు కేసీఆర్‌ రెడీ అవుతున్నారని ఆరోపించారు.

అధికార మదంతో రెచ్చిపోతున్న కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తానని, అడ్డుకోవడానికి సుప్రీంకోర్టు ఎవరు అంటారని రాములు మండిపడ్పడారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి నెల రోజులు కావొస్తున్నా ఇంత వరకు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం నిర్వహించలేదన్నారు.

రాబోయే ఎన్నికలల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ఢిల్లీలో అధికారంలోకి రానుందని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 16 సీట్లు కాంగ్రెస్‌తో కూడిన మిత్రపక్షాలకు వచ్చే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ పోరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని.. దీనిని పార్లమెంట్ ఎన్నికల్లో సైతం పునరావృతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

భద్రాచలం మండలంలోని ఐదు పంచాయతీలు ఏపీలోకి వెళ్లిన క్రమంలో పలు సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తక్షణం ఆ గ్రామాలను తిరిగి భద్రాచలం పరిధిలోకి తీసుకొస్తామన్నారు.

భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని, భద్రాద్రికి ప్రభుత్వం ప్రకటించిన రూ.100 కోట్లు విడుదల చేసేందుకు సర్కార్‌పై ఒత్తిడి తెస్తామన్నారు.

click me!