భద్రత పేరుతో బలి

Published : Jan 31, 2017, 11:10 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
భద్రత పేరుతో బలి

సారాంశం

పోలీసుల అత్యుత్సాహానికి అనారోగ్యంతో ఆస్పత్రికి వెళుతున్న వృద్ధురాలు బలైంది    

 

సీఎం పర్యటనలో పోలీసుల అత్యుత్సాహానికి  ఓ వృద్ధురాలు బలైంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ రోజు భక్త రామదాసు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి  రోడ్డు మార్గంలో ఖమ్మం పర్యటనకు వెళ్తూ మార్గం మధ్యలో సూర్యాపేటలోని మంత్రి జగదీష్‌ ఇంటికి వచ్చారు.

 

 

అయితే ఆ సమయంలో మంత్రి ఇంటి సమీపంలోని ఆస్పత్రికి శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన సోమా లక్ష్మమ్మ(65) అనే వృద్ధురాలిని చికిత్స కోసం తీసుకొచ్చారు. అయితే సీఎం బందోబస్తుకు వచ్చిన పోలీసులు భద్రత పేరుతో ఆ వీధిలోకి ఎవరినీ రానివ్వలేదు. ప్రాణాపాయంలో ఉన్న వృద్ధురాలిని కూడా చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొస్తుంటే అనుమతించలేదు.

 

 

దీంతో సకాలంలో వైద్యం అందక ఆమె మృతి చెందింది. పోలీసుల వల్లే తన భార్య మృతి చెందిందని లక్ష్మమ్మ భర్త కన్నీటి పర్యంతమయ్యారు.

 

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!