అయ్యో.. వృద్ధుడి ప్రాణం తీసిన మటన్ ముక్క..

Published : May 05, 2023, 05:45 PM IST
అయ్యో.. వృద్ధుడి ప్రాణం తీసిన మటన్ ముక్క..

సారాంశం

మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. 

అదృష్టం బాగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అనే సామెత వినే ఉంటారు. అరటి పండు తింటే పన్ను విరుగుతుందో? లేదో 
తెలియదు కానీ.. ఓ మటన్ ముక్క మాత్రం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. మటన్(mutton) ముక్కెంటీ? మనిషి ప్రాణాలు తీయడమేంటని అనుకుంటారా..? ఓ  మటన్ ముక్క వృద్ధుడి పాలిట మృత్యుదేవత అయ్యింది. ఓ వృద్ధుడు  భోజనం చేసే సమయంలో మటన్ ముక్క  గొంతులో ఇరుక్కొని ఊహిరాడక మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో కోనాపురంలో చోటుచేసుకుంది. 

వివ‌రాల‌లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా కోనాపురానికి చెందిన కుంజ ముత్తయ్య అనే వృద్ధుడు గురువారం నాడు తన కుమారుడితో కలిసి మటన్ కూరతో భోజనం చేశాడు. తింటున్న క్రమంలో ఓ మటన్ ముక్క ముత్తయ్య గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో.. ఆ వృద్ధుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఎన్ని నీళ్లు తాగినా ఆ మటన్ ముక్క గొంతులో నుంచి బ‌యట‌కు రాలేదు.. లోప‌లికి పోలేదు. దీంతో ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఊపిరాడక ముత్తయ్య చనిపోయిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.. ముత్తయ్య మరణంతో అతని కుటుంబం విషాదం చోటు చేసుకుంది.  

గతంలో ఇదే జిల్లాలో ఓ వ్యక్తి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోయాడు. బాలానగర్‌ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన పోచయ్య గౌడ్‌ (42)అనే వ్యక్తి చికెన్‌ తింటుండగా ప్రమాదవశాత్తు ఓ చికెన్ ముక్క ఆయన గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే పోచయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకున్న పోచయ్య గౌడ్‌  అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు.  

PREV
click me!

Recommended Stories

రేవంత్‌రెడ్డిపై భోరున ఏడ్చిన కొండా సుష్మిత | Konda Sushmita Emotional Comments On CM Revanth Reddy
Student Scholarship: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఏడాదికి రూ. 12,000 స్కాలర్‌షిప్, అప్లై పూర్తి వివరాలు ఇవే