మూడు రోజుల క్రితం ఘట్‌కేసర్‌లో అాదృశ్యమైన బాలుడు మృతి: మ్యాన్ హోల్ లో డెడ్‌బాడీ

Published : May 05, 2023, 03:50 PM IST
మూడు  రోజుల క్రితం  ఘట్‌కేసర్‌లో అాదృశ్యమైన బాలుడు మృతి:  మ్యాన్ హోల్ లో డెడ్‌బాడీ

సారాంశం

మూడు  రోజుల  క్రితం అదృశ్యమై న 12 ఏళ్ల బాలుడి మృతదేహం  ఘటన్ కేసర్ మండలం  కొండాపూర్ వద్ద లభ్యమైంది. 

హైదరాబాద్: నగరంలోని ఘట్ కేసర్ మండలం  కొండాపూర్  లో కన్పించకుండా  పోయిన  12 ఏళ్ల బాలుడు మ్యాన్ హోల్ లో శవంగా  కన్పించాడు. ఈ విషయమై  పోలీసులు కేసు నమోదు  చేసుకొని దర్యాప్తు  చేస్తున్నారు. 

మూడు రోజుల క్రితం తల్లి , అత్తతో కలిసి  12 ఏళ్ల బాలుడు  కొండాపూర్ చెరువు వద్దకు  వెళ్లాడు. తల్లి, అత్త బట్టలు ఉతికే సమయంలో  బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే బట్టలు ఉతికి  బాలుడి కోసం  తల్లి, అత్త వెతికారు. కానీ బాలుడు కన్పించలేదు. బాలుడి తండ్రికి  సమాచారం ఇచ్చారు. అంతా వెదికినా కూడా బాలుడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.  దీంతో  కుటుంబ సభ్యులు  పోలీసులకు ఫిర్యాదు  చేశారు. కొండాపూర్ చెరువులో రెండు రోజులుగా గజ ఈతగాళ్లు  బాలుడి కోసం  గాలించారు. కానీ  బాలుడి ఆచూకీ లభ్యం కాలేదు. కానీ ఇవాళ చెరువు పక్కనే  ఉన్న మ్యాన్ హోల్ లో  బాలుడి మృతదేహం తేలియాడుతూ  కన్పించింది.

ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూడు రోజుల క్రితం  అదృశ్యమైన బాలుడిగా  గుర్తించారు. ఆడుకొంటూ  ప్రమాదవశాత్తు బాలుడు మ్యాన్ హోల్ లో పడిపోయి ఉంటాడా, లేక ఇతరత్రా కారణాలున్నాయా అనే విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: రూ. 26 ల‌క్ష‌ల‌కే గ‌చ్చిబౌలిలో అపార్ట్‌మెంట్‌.. ల‌క్కీ ఛాన్స్‌, వెంట‌నే అప్లై చేసుకోండి.
Hyderabad: ఇక‌పై గోవా వెళ్లాల్సిన ప‌నిలేదు.. హైద‌రాబాద్‌లో 35 ఎకరాల్లో, రూ. 350 కోట్లతో అద్భుత నిర్మాణం