కరోనా ఎఫెక్ట్.. భారీ ధరకు మాస్క్ ల విక్రయం

By telugu news teamFirst Published Mar 10, 2020, 10:03 AM IST
Highlights

ప్రజల భయాన్ని కొందరు మెడికల్ షాప్ యజమానులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మూతికి  కట్టుకునే మాస్క్ లను భారీ ధరకు అమ్ముతున్నారు. అలా అమ్మినందుకు ఓ మెడికల్ షాక్ యజమానికి రూ.20వేలు జరిమానా విధించినట్లు శేరిలింగంపల్లి సర్కిల్-21 ఉప వైద్యాధికారి డాక్టర్ రంజిత్ తెలిపారు.

కరోనా వైరస్ పేరు చెబితేనే ప్రజలు భయపడిపోతున్నారు. చైనాలో మొదలైన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ప్రజలు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మూతికి కట్టుకునే మాస్క్ లు, చేతులు శుభ్రం చేసుకునే సానిటైజర్లను విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు.

ప్రజల భయాన్ని కొందరు మెడికల్ షాప్ యజమానులు క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో మూతికి  కట్టుకునే మాస్క్ లను భారీ ధరకు అమ్ముతున్నారు. అలా అమ్మినందుకు ఓ మెడికల్ షాక్ యజమానికి రూ.20వేలు జరిమానా విధించినట్లు శేరిలింగంపల్లి సర్కిల్-21 ఉప వైద్యాధికారి డాక్టర్ రంజిత్ తెలిపారు.

Also Read ఆ రెస్టారెంట్ కి ఎవరూ వెళ్లొద్దు.. కరోనా వైరస్ సోకిందంటూ ప్రచారం...

అంజయ్య నగర్ లోని సాయిదుర్గ మెడికల్ స్టోర్ లో కరోనా సాకుతో మాస్క్ లను అధిక ధరలకు అమ్ముతున్నట్లు అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఉపవైద్యాధికారి రంజిత్, సిబ్బంది మెడికల్ స్టోర్ యజమానికి జరిమానా విధించారు. అధిక ధరకు విక్రయిస్తే ట్రేడ్‌ లైసెన్స్‌ రద్దు చేస్తామని ఆయన హెచ్చరించారు.

కాగా... ఈ ఒక్క ప్రాంతంలోనే కాకుండా.. చాలా ప్రాంతాల్లో ఇలానే చేస్తున్నట్లు తెలుస్తోంది. అసలు ధర కన్నా రెట్టింపు ధరతో మాస్క్ లను కొనుగోలు చేస్తున్నట్లు అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో అన్ని మెడికల్ షాప్ యజమానులకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎవరైనా ఎక్కువ ధరలకు అమ్మకాలు జరిపితే భారీ జరిమానాలతోపాటు తగిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. 

click me!