Hyderabad Rains : సఫారీ జూపార్క్‌ను ముంచెత్తిన వరద.. పార్క్ మూసివేసిన సిబ్బంది

By Siva Kodati  |  First Published Jul 12, 2022, 8:00 PM IST

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత హుస్సేన్ సాగర్ నిండు కుండను తలపిస్తోంది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు కాగా.. ప్రస్తుతం 513.41 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో సఫారీ జూపార్క్ లోకి వరద నీరు రావడంతో జూను అధికారులు మూసివేశారు


ఎడతెరిపి లేని వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసి ముద్ధవుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. ఈ క్రమంలో సఫారీ జూపార్క్ లోకి వరద నీరు రావడంతో జూను అధికారులు మూసివేశారు. మీర్ ఆలం ట్యాంకులోకి భారీగా వరద నీరు చేరింది. మీర్ ఆలం ట్యాంక్ ను ఆనుకొనే ఈ జూ పార్క్ వుంది. 

ఇకపోతే.. హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయింది. దీని పూర్తి స్థాయి నీటి మట్టం 514.75 అడుగులు కాగా.. ప్రస్తుతం 513.41 అడుగులకు చేరుకుంది. ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ కు వరద నీరు పోటెత్తుతోంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలోనైనా వరద నీరు దిగువకు విడుదల చేసే అవకాశం వుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Latest Videos

undefined

ALso REad:Hyderabad Rains : ప్రమాదకర స్థాయిలో హుస్సేన్ సాగర్ కు వరద.. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం

మరోవైపు.. GHMC  పరిధిలో మరో 12 గంటల పాటు ఈదురుగాలులతో కూడిన Rain కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  హెచ్చరించింది. ఈ మేరకు  ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.  ఇప్పటికే ఐదు రోజులుగా Hyderabad నరంలో వర్షాలు కురుస్తున్నాయి.  ఇవాళ మధ్యాహ్నం నుండి నగర వ్యాప్తంగా ఈదురు గాలులతో  వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఈదురు గాలులతో వర్షం కురిసే అవకాశం ఉన్నందున చెట్ల కింద  ఎవరూ ఉండొద్దని కూడా అధికారులు కోరుతున్నారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావొద్దని  జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. 

గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణశాఖాధికారులు హెచ్చరించారు. ఈదురు గాలుల కారణంగా  చెట్ల కొమ్మలు, ఫ్లెక్సీల, హౌర్డింగ్ లు కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వాహనదారులు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మెట్రో పిల్లర్లపై ఉన్న ఎల్‌ఈడీ స్క్రీన్లను కూడా అధికారులు తొలగించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పటికే 40 బృందాలు పనిచేస్తున్నాయి. వర్షం, వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ బృందాలు పనిచేస్తున్నాయి.
 

click me!