లైంగిక ఆరోపణలు.. భర్తపై ఉన్నతాధికారులు చర్యలు: మనస్తాపంతో శానిటైజర్ తాగిన ఎస్సై భార్య

Siva Kodati |  
Published : Jul 12, 2022, 06:18 PM IST
లైంగిక ఆరోపణలు.. భర్తపై ఉన్నతాధికారులు చర్యలు:  మనస్తాపంతో శానిటైజర్ తాగిన ఎస్సై భార్య

సారాంశం

తన భర్తపై యువతి ఫిర్యాదు చేయడం, ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకోవడంతో కొమురం భీం జిల్లా రెబ్బెన ఎస్సై భవానీ సేన్ భార్య మనస్తాపానికి గురైంది. దీంతో ఆమె ఇంట్లో శానిటైజర్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

కొమురం భీం జిల్లాలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రెబ్బెన ఎస్సై భార్య ఆత్మహత్యకు ప్రయత్నించింది. తన భర్తపై యువతి ఫిర్యాదు చేయడం, ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇంట్లో వున్న శానిటైజర్ తాగింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ. రెబ్బెన ఎస్సై భవానీ సేన్ ను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే బాధిత యువతి స్టేట్ మెంట్ రికార్డు చేశారు పోలీసులు. 

కాగా.. ఇటీవల తెలంగాణలో పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీటికి ప్రిపేర్ అవుతోన్న తనకు మాయమాటలు చెప్పి ఎస్సై భవానీ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. 

Also Read:హయత్‌నగర్ లో జడ్జి ముందుకు: సస్పెన్షన్ కు గురైన మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వర్ రావు

ఇకపోతే.. మహిళ కిడ్నాప్, అత్యాచారం కేసులో సికింద్రాబాద్ మారేడ్ పల్లి సీఐ నాగేశ్వరరావుపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీన హస్తినాపురం వద్ద  వివాహిత ఇంటికి వెళ్లి ఆమెపై సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడినట్టుగా బాధితురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. అదే సమయంలో ఇంటికి వచ్చిన భర్త, నాగేశ్వరరావు మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకొంది.  అంతేకాదు తమను సీఐ నాగేశ్వరరావు బెదిరించాడని బాధితులు ఫిర్యాదు చేశారు. 

తన కారులోనే బాధితులను ఇబ్రహీంపట్నం వైపునకు తీసుకెళ్తున్న సమయంలో  సీఐ కారు ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదం జరిగిన తర్వాత భార్యాభర్తలు అక్కడి నుండి వెళ్లిపోయారు. అదే రోజున వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు ఆధారంగా హైద్రాబాద్ సీపీ సీవీ Anandమారేడ్ పల్లి సీఐ నాగేశ్వర్ రావును  సస్పెండ్ చేస్తూ ఆదశాలు జారీ చేశారు.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ