భార్యతో కలిసి 900 కి.మీ.సైకిల్‌పై: స్వగ్రామం చేరకుండానే క్వారంటైన్ కి

By narsimha lodeFirst Published Apr 27, 2020, 1:36 PM IST
Highlights

:లాక్ డౌన్ కారణంగా సైకిల్ పై ఓ వలసకూలీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుండి తన భార్యతో కలిసి సైకిల్ పై ఒడిశా రాష్ట్రంలోని ఖైర్‌పుట్ ప్రాంతానికి చేరుకొన్నాడు. సుమారు 900 కి.మీ సైకిల్ పై భార్యతో కలిసి ప్రయాణించాడు.


కరీంనగర్:లాక్ డౌన్ కారణంగా సైకిల్ పై ఓ వలసకూలీ తెలంగాణలోని కరీంనగర్ జిల్లా నుండి తన భార్యతో కలిసి సైకిల్ పై ఒడిశా రాష్ట్రంలోని ఖైర్‌పుట్ ప్రాంతానికి చేరుకొన్నాడు. సుమారు 900 కి.మీ సైకిల్ పై భార్యతో కలిసి ఆయన ప్రయాణించాడు.

ఒడిశా రాష్ట్రంలోని ఖైర్‌పుట్ బ్లాక్ పరిధిలోని సింధిగూడ గ్రామానికి చెందిన 24 ఏళ్ల త్రినాథ్ సంగారియా అతని భార్య కబితలు ఉపాధి కోసం తెలంగాణలోని కరీంనగర్ కు వచ్చారు. 

కరీంనగర్ పట్టణంలోని ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీలో వాళ్లు పనిచేసేవారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఇక్కడ పనులు నిలిచిపోయాయి. దీంతో తన వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బులతో కొంతకాలం కరీంనగర్ లో నే ఆయన గడిపాడు.

also read:పెళ్లి కోసం 850 కి.మీ. సైకిల్‌పై: ఇంటికి చేరకుండానే క్వారంటైన్‌కి

తన వద్ద ఉన్న డబ్బులు అయిపోయాయి. మరో వైపు పనులు ఎప్పుడు ప్రారంభమయ్యే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో తన స్వగ్రామం వెళ్లాలని ఆయన నిర్ణయించుకొన్నాడు.

చాలా రోజుల పాటు ఆకలితో ఉండాల్సి వచ్చింది. దీంతో ఒడిశాకు వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నాడు త్రినాథ్.తాను పనిచేసే కాంట్రాక్టర్ వద్ద ఆయన రూ. 7 వేలు అప్పుగా తీసుకొన్నాడు. ఈ డబ్బుతో ఆయన ఓ సైకిల్ ను కొనుగోలు చేశాడు.

సైకిల్ పై  ఈ నెల 18వ తేదీన బయలుదేరి ఈ నెల 25వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని గోవిందపల్లికి చేరుకొన్నారు. మరో 15 కి.మీ ప్రయాణం చేస్తే తమ స్వగ్రామం సింధిగూడకు చేరుకొనేవాళ్లు.

అయితే గోవిందపల్లి వద్ద గ్రామపంచాయితీ సెక్రటరీ ఇతర గ్రామస్తులు ఈ దంపతులను నిలిపివేశారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చినందున క్వారంటైన్ కు వెళ్లాలని సూచించారు.దీంతో గోవిందపల్లిలోనే ఈ దంపతులు క్వారంటైన్ లో ఉన్నారు. 

 

click me!