కరోనా దెబ్బ: ఆదిలాబాద్ సరిహద్దులో ఇటలీ యాత్రికుల వాహనాల నిలిపివేత

By narsimha lodeFirst Published Apr 27, 2020, 11:44 AM IST
Highlights

తెలంగాణ, మహారాష్ట్ర  సరిహద్దుల్లో ఇటలీ నుండి వచ్చిన యాత్రికులను పోలీసులు నిలిపివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ చెక్ పోస్టు 
వద్ద తెలంగాణ పోలీసులు ఈ వాహనాలను నిలిపివేశారు.

ఆదిలాబాద్: తెలంగాణ, మహారాష్ట్ర  సరిహద్దుల్లో ఇటలీ నుండి వచ్చిన యాత్రికులను పోలీసులు నిలిపివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని జైనాథ్ చెక్ పోస్టు 
వద్ద తెలంగాణ పోలీసులు ఈ వాహనాలను నిలిపివేశారు.

ఇటలీ యాత్ర పూర్తిచేసుకొన్న 76 మంది యాత్రికులు మూడు బస్సులో తెలంగాణ రాష్ట్రానికి వచ్చేందుకు ఇవాళ ఉదయం జైనథ్ చెక్ పోస్టు వద్దకు చేరుకున్నారు. వీరందరికి ఢిల్లీలో క్వాంరటైన్ పూర్తయింది. ఈ విషయాన్ని యాత్రికులు పోలీసులకు తెలిపారు. 

దీనికి సంబంధించిన ఆధారాలను కూడా చూపారు. కానీ ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం అనుమతిస్తే ఈ వాహనాలను తెలంగాణలోకి  అనుమతిస్తామనిపోలీసులు స్పష్టం చేశారు.ఇదే సమయంలో 13 వాహనాల్లో రిటైర్డ్ ఆర్మీ అధికారులు 27 మంది తెలంగాణ లోకి వచ్చేందుకు ఇక్కడికి చేరుకున్నారు. వీరిని కూడా పోలీసులు అక్కడే నిలిపివేశారు ఉన్నతాధికారుల నుండి అనుమతి వస్తేనే తాము తెలంగాణలోకి అనుమతిస్తామని పోలీసులు తేల్చి చెప్పారు. 

తమకు రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ఇటలీ నుండి వచ్చిన యాత్రికులు, రిటైర్డ్ ఆర్మీ అధికారులు జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు. అధికారుల నుండి అనుమతి వచ్చేవరకు కూడ ఈ చెక్ పోస్టు వద్దే వారు ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వీరందరికి స్థానిక పోలీసులు భోజన వసతిని కల్పించారు. 

click me!