డీఎస్‌కు ఎదురుదెబ్బ: తనయుడిపై లైంగిక ఆరోపణలు

First Published Aug 2, 2018, 7:05 PM IST
Highlights

డీఎస్ కుమారుడు  సంజయ్‌ తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని శాంకరి కాలేజీ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు గురువారం నాడు  రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డికి ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: డీఎస్ కుమారుడు  సంజయ్‌ తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని శాంకరి కాలేజీ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినులు గురువారం నాడు  రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మరెడ్డికి ఫిర్యాదు చేశారు.

డీఎస్ తనయుడు సంజయ్ శాంకరీ  నర్సింగ్ కాలేజీని నిర్వహిస్తున్నాడు.ఈ కాలేజీ లో చదువుకొనే నర్సింగ్ విద్యార్థినులు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి ఫిర్యాదు చేశారు.

తమను సంజయ్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. తన గదిలోకి రావాలని  తమను వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థులు హోంమంత్రి నాయిని నర్సింహ్మరెడ్డికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు తమపై  అసభ్యపదజాలంతో  దూషిస్తున్నారని కూడ  చెప్పారు.

డీఎస్‌ పార్టీ మారుతాడని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని టీఆర్ఎస్‌కు చెందిన ప్రజాప్రతినిదులు  ఆయనకు వ్యతిరేకంగా  సీఎం కేసీఆర్ కు లేఖ రాశారు.

ఈ ఆరోపణలను  డీఎస్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై  తన వివరణ ఇచ్చేందుకు డీఎస్ ప్రయత్నించాడు. సీఎం అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించాడు. కానీ, ఇంతవరకు సీఎం మాత్రం డీఎస్ కు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈ తరుణంలో  సంజయ్‌పై  నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు లైంగిక ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకొంది.

డీఎస్ తనయుడు సంజయ్ నడిపే నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు తమ బాధలను హోంమంత్రికి వివరించారు.పీఓడబ్ల్యూ నేత సంధ్య నేతృత్వంలో నర్సింగ్ విద్యార్థినులు  హోంమంత్రిని కలిశారు.

ఫస్టియర్ నర్సింగ్ విద్యార్థినులు 13 మందిలో 11 మంది విద్యార్థినులు హోం మంత్రికి ఫిర్యాదు చేశారు. హోం మంత్రి ముందు  విద్యార్థులు, తల్లిదండ్రులు తమ గోడును చెప్పుకొన్నారు.

 మా కాలేజీపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదని హోంమంత్రి తమకు హామీ ఇచ్చారని పీఓడబ్ల్యూ సంఘం నేత సంధ్య చెప్పారు.

అయితే రేపు డీజీపీ, కమిషనర్‌ను కలవాలని హోం మంత్రి నాయిని నర్సింహరెడ్డి సూచించారు.కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని కూడ  సంధ్య డిమాండ్ చేశారు. 

click me!