కరోనా ఎఫెక్ట్ .. నాంపల్లి ఎగ్జిబిషన్ రద్దు, సొసైటీ కీలక నిర్ణయం

Siva Kodati |  
Published : Jan 06, 2022, 06:56 PM ISTUpdated : Jan 06, 2022, 07:01 PM IST
కరోనా ఎఫెక్ట్ .. నాంపల్లి ఎగ్జిబిషన్ రద్దు, సొసైటీ కీలక నిర్ణయం

సారాంశం

హైదరాబాద్‌లో ప్రఖ్యాత నాంపల్లి ఎగ్జిబిషన్‌ రద్దయ్యింది. ఈ మేరకు ఎగ్జిబిషన్ సోసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో , హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. 

దేశంలో ఒమిక్రాన్, కరోనా కేసులు భారీగా పెరుతున్న నేపథ్యంలో ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ, థియేటర్లలో 50 శాతం ఆక్యూపెన్సీ వంటి ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు. అటు కేంద్ర ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి ప్రభుత్వం వ్యాక్సిన్ వేస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో ప్రఖ్యాత నాంపల్లి ఎగ్జిబిషన్‌ రద్దయ్యింది. ఈ మేరకు ఎగ్జిబిషన్ సోసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో , హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. 

ఇప్పటికే Corona, Omicron కారణంగా Nampally Exhibition ను తాత్కాలికంగా మూసివేశారు. జనవరి 1వ తేదీన గవర్నర్ Numaish ఎగ్జిబిషన్ ను ప్రారంభించగా ఆదివారం రాత్రి పోలీస్ శాఖ అదికారుల ఆదేశాలతో ఎగ్జిబిసన్ సొసైటీ ఈ నెల 10వ తేదీ వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు స్టాళ్ల యజమానులకు తెలిపారు. దేశం నలుమూలలా కరోనా నిబంధనలు పాటించాలని, గుంపులు, సభలు, సమావేశాలు నిర్వహించవద్దనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఎగ్జిబిషన్ కు బ్రేక్ పడింది. 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ కు కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేశారు. కొన్ని రోజులుగా నగరంతో పాటు రాష్ట్రం నలుమూలలా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. 

ఇదిలా ఉండగా, తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతోన్న నేప‌థ్యంలో సీఎం KCR ప్రగతిభవన్ లో Medical and Health Officers‌తో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ‌లో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తిపై  సుదీర్ఘంగా చర్చించారు. ఒమిక్రాన్ వ్యాప్తి ప‌ట్ల‌ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కానీ, అజాగ్రత్త ప‌నికి రాద‌నీ, అప్రమత్తంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రజలంతా తప్పనిసరిగా Maskలు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు.

ఈ మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంద‌ని స్పష్టం చేశారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో Lock down విధించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ స‌మావేశంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు, వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. మౌలిక వసతుల క‌ల్ప‌న‌పై పటిష్ట పరచాలని,  బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను సమకూర్చుకోవాలని సూచించారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ దవాఖానాల్లో ఉన్న మొత్తం బెడ్లల్లో దాదాపు 99 శాతం బెడ్లను ఇప్పటికే ఆక్సిజన్ బెడ్లుగా  మార్చామ‌ని, మిగిలిన ఒక శాతం బెడ్ల‌ను కూడా ఆక్సిజన్ బెడ్లుగా మార్చాల‌ని సూచించారు. గతంలో తెలంగాణ‌లో కేవలం 140 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం మాత్రమే ఉన్నా..  ఆక్సిజన్ ఉత్పత్తిని ఇప్పుడు 324 మెట్రిక్ టన్నులకు పెంచుకోగలిగామ‌ని, ప్ర‌స్తుతం ఆక్సిజన్ ఉత్పత్తిని 500 మెట్రిక్ టన్నుల వరకు పెంచడానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా