ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

Siva Kodati |  
Published : Aug 01, 2022, 04:45 PM ISTUpdated : Aug 01, 2022, 05:07 PM IST
ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరిది ఆత్మహత్యగా తేల్చిన పోలీసులు

సారాంశం

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివసిస్తోన్న ఆమె.. చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది.

ఎన్టీఆర్ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా ప్రముఖ తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో నివసిస్తోన్న ఆమె.. చున్నీతో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఎన్టీవీ తన కథనంలో పేర్కొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఉమామహేశ్వరి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమామహేశ్వరి మరణవార్త తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సినీనటుడు బాలకృష్ణ ఆమె ఇంటికి చేరుకున్నారు. 

ఐపీసీ సెక్షన్ 174 కింద అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు పోలీసులు. పోస్ట్‌మార్టం అనంతరం భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ఇకపోతే.. ఉమామహేశ్వరికి భర్త శ్రీనివాస్ ప్రసాద్ , ఇద్దరు కూతుళ్లు వున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ ప్రసాద్ అనంతపురంలో వున్నట్లుగా తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?