టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ ను సీబీఐతో విచారించాలన్న ఎన్‌ఎస్‌యూఐ: హైకోర్టుకు రేవంత్

By narsimha lode  |  First Published Mar 21, 2023, 1:20 PM IST

టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసుకు  సంబంధించి   సీబీఐతో విచారణ  చేయించాలని  ఎన్‌ఎస్‌యూఐ తరపు న్యాయవాది  డిమాండ్  చేశారు.  


హైదరాబాద్: టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసును  సీబీఐతో  విచారణ  జరిపించాలని  ఎన్‌ఎస్‌యూఐ తరపు న్యాయవాది  తెలంగాణ  హైకోర్టులో వాదనలు విన్పించారు.  

టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం లీక్ కేసును  సీబీఐ తో విచారణ జరిపించాలని ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్ దాఖలు  చేసింది. ఈ పిటిషన్ పై   కాంగ్రెస్ లీగల్ సెల్  అధ్యక్షుడు వివేక్ ధన్కే  మంగళవారంనాడు   వాదనలు విన్పించారు.   టీఎస్‌పీఎస్‌సీ  ఇప్పటికే  నాలుగు  పరీక్షలను  రద్దు  చేసిందని  వివేక్ తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. మరో వైపు రెండు పరీక్షల షెడ్యూల్ ను  వాయిదా వేసిన విషయాన్ని  వివేక్  కోర్టుకు  తెలిపారు. 

Latest Videos

undefined

 ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించి  మంత్రి కేటీఆర్  మీడియా సమావేశంలో ప్రస్తావించిన  అంశాలను  వివేక్   హైకోర్టు ముందుంచారు.  ఈ పేపర్ లీకేజీ  వెనుక  పెద్దల హస్తం ఉందని   ఆయన  అనుమానం వ్యక్తం  చేశారు.ఈ కేసు  విచారణను  సీబీఐకి ఇవ్వాలని  వివేక్  హైకోర్టును  కోరారు.  టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం లీక్  అంశం  3 లక్షల  మంది అభ్యర్ధులకు  సంబంధించిన అంశంగా  వివేక్  చెప్పారు.  పేపర్ లీక్  అంశానికి  సంబంధించి  పది అంశాలను  వివేక్  కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.  

ఈ పిటిషన్ పై విచారణ సాగుతున్నందున టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి   మంగళవారంనాడు హైకోర్టుకు చేరుకున్నారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్ కేసు విషయమై  కాంగ్రెస్ పార్టీ  సీరియస్ గా  స్పందించింది.  ఈ కేసు విషయమై  టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి  తీవ్ర విమర్శలు  చేశారు.  మంత్రి కేటీఆర్  కార్యాలయం టీఎస్‌పీఎస్‌సీ  ప్రశ్నాపత్రం లీక్  కేసును   చక్కబెట్టిందని  ఆయన  ఆరోపించారు. ఈ పేపర్ లీక్ కేసులో  మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి  హస్తం ఉందని  రేవంత్ రెడ్డి  ఆరోపించారు. 

also read:టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీక్: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రాసిన నలుగురు ఎన్ఆర్ఐలు

టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీక్  విషయంలో  తొమ్మిది  మందిని  పోలీసులు అరెస్ట్  చేశారు.ఈ కేసును  విచారించేందుకు  రాష్ట్ర ప్రభుత్వం  సిట్  ను ఏర్పాటు  చేసింది. పేపర్ లీక్  కేసులో  నిందితులను  సిట్  బృందం  విచారిస్తుంది.  వరుసగా నాలుగు రోజులుగా  సిట్  బృందం  పేపర్ లీక్  నిందితులను  విచారిస్తుంది.

click me!