ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణికి మెసేజ్‌లు.. ఎన్నారైని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు..

Published : May 11, 2022, 12:12 PM IST
ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణికి మెసేజ్‌లు.. ఎన్నారైని అరెస్ట్ చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు..

సారాంశం

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పంజాబ్‌కు చెందిన మల్‌రాజ్ సింగ్‌గా గుర్తించారు. తొలుత సోషల్ మీడియాలో మెసేజ్‌లు పెట్టిన అతడు.. తర్వాత ఆమెను కలిసేందుకు హైదరాబాద్‌కు వచ్చాడు. 

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిని వేధిస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని పంజాబ్‌కు చెందిన మల్‌రాజ్ సింగ్‌గా గుర్తించారు. వివరాలు.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ప్రాంతానికి చెందిన మల్‌రాజ్‌ సింగ్‌ కాలిఫోర్నియాలో ట్రక్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గ్రీన్‌కార్డు సైతం ఉంది. పంజాబ్‌ క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్‌ అధికారికి అతడు సామాజిక మాధ్యమాల్లో మెసేజ్‌లు పంపుతున్నాడు. ఆమె ఫొటోలు సోషల్‌ మీడియా నుంచి తీసుకుని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడు. 

అయితే రెండు నెలల క్రితం ఆ ట్రైనీ ఐపీఎస్ అధికారిణి.. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో నిర్వహిస్తున్న శిక్షణలో పాల్గొంటున్నారు. అక్కడే ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. అయితే మల్‌రాజ్.. ఆమె కోసం ఇటీవల పంజాబ్‌కు వచ్చాడు. ఆమె హైదరాబాద్‌లో ఉందని తెలుసుకుని.. గత నెల 1వ తేదీన ఎంసీహెచ్‌ఆర్‌డీకి వెళ్లాడు. అక్కడ ఆమెతో మాట్లాడేందుకు మల్‌రాజ్ ప్రయత్నించాడు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో బెదిరించడం మొదలుపెట్టాడు. 

ఈ క్రమంలోనే మెసేజ్‌లు పంపుతూ వేధించసాగాడు. దీంతో ఆమె ఈ విషయాన్ని ఎంసీహెచ్‌ఆర్‌డీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడి కోసం గాలింపు చేపట్టారు. అతడిని అరెస్ట్ చేసి.. జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అతడిపై ఐపీసీలోని 509, 354డీ, 452 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. 
 

PREV
click me!

Recommended Stories

Real Estate : లక్షల్లో పెట్టుబడి, కోట్లలో లాభం ! హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ డెస్టినేషన్ ఇదే
YCP Leaders Protest Against ABN Weekend Comment Over Controversial Remarks | Asianet News Telugu