అరెస్టైన నిందితుడి డెబిట్ కార్డు నుండి రూ.5.5 లక్షలు స్వాహా: సీఐపై సస్పెన్షన్ వేటు

Published : May 11, 2022, 10:22 AM ISTUpdated : May 11, 2022, 11:11 AM IST
 అరెస్టైన నిందితుడి డెబిట్ కార్డు నుండి రూ.5.5 లక్షలు స్వాహా: సీఐపై సస్పెన్షన్ వేటు

సారాంశం

చోరీ కేసులో అరెస్టైన నిందితుడి డెబిట్ కార్డు నుండి రూ. 5. 5 లక్షలను డ్రా చేసిన ఆరోపణలతో సీసీఎస్ సీఐ దేవేందర్ ను సస్పెండ్ చేశారు రాచకొండ సీపీ మహేష్ భగవత్.


హైదరాబాద్: చోరీ కేసులో అరెస్టైన  నిందితుడు అగర్వాల్ Debit  కార్డు నుండి రూ. 5.5 లక్షలు స్వాహా చేసిన ఆరోపణలతో రాచకొండ సీసీఎస్ ఇన్స్ పెక్టర్ దేవేందర్ ను Rachakonda  సీపీ మహేష్ భగవత్ బుధవారం నాడు సస్పెండ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చోరీ కేసులో అగర్వాల్ ను రాచకొండ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో Agarwal వద్ద ఉన్న డెబిట్ కార్డును సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు.

Jail నుండి బెయిల్ పై విడుదలైన అగర్వాల్ తన బ్యాంకు ఖాతాను పరిశీలించిన సమయంలో తన ఖాతా నుండి రూ. 5.5 లక్షలు స్వాహా అయిన విషయాన్ని గుర్తించారు. ఈ విషయమై బ్యాంకు అధికారులను ఆరా తీశారు. అయితే ATM ల ద్వారా డబ్బులు డ్రా చేసినట్టుగా బ్యాంకు అధికారులు అగర్వాల్ కు సమాచారం ఇచ్చారు. బ్యాంకు నుండి తీసుకున్న సమాచారం ఆధారంగా  రాచకొండ సీపీ  Mahesh Bhagwat  కు నిందితుడు అగర్వాల్ పిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  ఈ విషయమై అంతర్గత విచారణకు మహేష్ భగవత్ ఆదేశించారు.ఈ ఆదేశాల అనుగుణంగా మహేష్ భగవత్ అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో CCS ఇన్స్ పెక్టర్ Devender పై ఆరోపణలు నిజమని తేలడంతో ఆయననను సస్పెండ్ చేస్తూ మహేష్ భగవత్ బుధవారం నాడు ఆదేశాలు జారీ చేశారు.

చోరీ కేసులో నిందితుడి వద్ద సీజ్ చేసిన వస్తువులను జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత నిందితుడికి అప్పగించాలి. ఈ వస్తువులను పోలీసులు ఉపయోగించవద్దు. కానీ ఈ నిబంధనలను తుంగలో తొక్కిన సీఐ అగర్వాల్ డెబిట్ కార్డు నుండి డబ్బులు డ్రా చేశారు. నిందితుడు బ్యాంకు ఖాతా నుండి సీఐ స్థాయి అధికారి రూ. 5 లక్షలు స్వాహా చేయడం కలకలం రేపుతుంది.

దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగల వద్ద డబ్బులను చోరీ చేయడం ప్రస్తుతం చర్చకు దారి తీసింది. సమాజానికి రక్షణ కల్పించే విధుల్లో ఉన్న సీఐ స్థాయి అధికారి  నిందితుడి బ్యాంకు ఖాతా నుండి డబ్బులు డ్రా చేయడం పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చగా మారింది. రానున్న రోజుల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కూడా పలువురు కోరుతున్నారు.దొంగతనానికి గురైన సొమ్మును కూడా కొందరు పోలీసులు అధికారులు స్వాహా చేసిన ఘటనలు కూడా గతంలో చోటు చేసుకొన్నాయి. 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మ‌రో అద్భుతం.. రూ. 1200 కోట్ల‌తో భారీ షాపింగ్ మాల్‌. ఎక్క‌డో తెలుసా.?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?