తల్లితో వివాహేతర సంబంధం... అడ్డుగా వున్నాడని కొడుకుని హతమార్చి....

Arun Kumar P   | Asianet News
Published : Apr 01, 2021, 09:44 AM IST
తల్లితో వివాహేతర సంబంధం... అడ్డుగా వున్నాడని కొడుకుని హతమార్చి....

సారాంశం

కామంతో కళ్ళు మూసుకుపోయి అభం శుభం తెలియని బాలున్ని చాతీపై బాది హతమార్చి  సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి అడ్డంగా బుక్కయ్యాడు. . 

హైదరాబాద్: అక్రమ సంబంధానిక అడ్డుగా వున్నాడని ఓ చిన్నారిని అతికిరాతకంగా హతమార్చాడు ఓ దుర్మార్గుడు. వివాహితతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ ఆమె కన్న కొడుకును చంపేశాడు. కామంతో కళ్ళు మూసుకుపోయి అభం శుభం తెలియని బాలున్ని చాతీపై బాది హతమార్చి సాధారణ మరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అయితే వీరిపై అనుమానంతో పోలీసులు తమదైన స్టైల్లో విచారణ జరపగా అసలు నిజం బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లో  అజయ్ లాల్‌‌-మౌనిక దంపతులు కొడుకు రోహిత్(18నెలలు)తో కలిసి నివాసముండేవారు. అయితే భార్యాభర్తల మద్య మనస్పర్దలు రావడంతో విడిపోయి వేరువేరుగా వుంటున్నారు. కొడుకు తల్లి వద్దే వుంటున్నాడు. 

సరూర్ నగర్ లో ఒంటరిగా వుంటున్న మౌనికతో మద్దికుంట రాజు అనే యువకుడు పరిచయాన్ని పెంచుకున్నాడు. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. అయితే తమ అక్రమ బంధానికి రోహిత్ అడ్డుగా నిలిచాడని బావించిన రాజు దారుణానికి పాల్పడ్డాడు. మౌనిక ఇంట్లో లేని సమయంలో బాలుడి చాతీపై బాది అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం బాలుడిది సాధారణ మరణంగానే నమ్మించే ప్రయత్నం చేశాడు.

అయితే వీరి మాటలు, ప్రవర్తనపై అనుమానం వచ్చిన అజయ్‌లాల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మౌనిక, మద్దికుంట రాజు పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే కొట్టి చంపినట్లు రాజు ఒప్పుకున్నాడు.దీంతో నిందితుడ్ని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్