నోముల భగత్ విజయం... సాగర్ ప్రజలకు కెసిఆర్ కృతజ్జతలు

Arun Kumar P   | Asianet News
Published : May 02, 2021, 04:48 PM IST
నోముల భగత్ విజయం... సాగర్ ప్రజలకు కెసిఆర్ కృతజ్జతలు

సారాంశం

త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తో కలిసి నాగార్జున సాగర్ నియోజకవర్గాన్ని సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సిఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

నాగార్జునసాగర్: టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ కు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు సిఎం కెసిఆర్ హృదయపూర్వక కృతజ్జతలు, ధన్యవాదాలు తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వ విధానం ప్రకారం, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి వాగ్ధానాన్ని నెరవేరుస్తామని సిఎం మరోసారి గుర్తుచేశారు. త్వరలోనే ఎమ్మెల్యే భగత్ తో పాటు నాగార్జున సాగర్ నియోజక వర్గం సందర్శించి ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామని సిఎం స్పష్టం చేశారు.

దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధుల్లో ఇటీవల మంజూరు చేసిన లిఫ్టు ఇరిగేషన్ స్కీంలను శరవేగంగా పూర్తిచేసి ప్రజలకు నీరందిస్తామని సిఎం తెలిపారు. ఎన్నికల సందర్భంలో పార్టీ నాయకులు సేకరించిన ప్రజా సమస్యన్నింటిని కూడా సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

read more  నాగార్జునసాగర్‌లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ: కానీ, ఊరటనిచ్చే అంశమిదీ....

ఎవరు ఎన్నిరకాల దుష్ప్రచారం చేసినా.. టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల తమ విశ్వాసాన్ని ప్రస్పుటంగా ప్రకటించిన ప్రజలకు సిఎం మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రెట్టించిన ఉత్సాహంతో మున్ముందు ప్రజాసేవకు టిఆర్ఎస్ పార్టీ మరింతగా పునరంకితమౌతుందని.. సిఎం మారోమారు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ కు సిఎం కెసిఆర్ హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. చక్కగా ప్రజాసేవ చేసి మంచి రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని నోముల భగత్ కు సిఎం సూచించారు. నోముల భగత్ విజయం కోసం కృషి చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సిఎం అభినందనలు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు