అంతకంతకు పెరుగుతున్న టీఆర్ఎస్ ఆధిక్యం... 22వ రౌండ్ లో ఎంతంటే?

Arun Kumar P   | Asianet News
Published : May 02, 2021, 03:02 PM ISTUpdated : May 02, 2021, 03:08 PM IST
అంతకంతకు పెరుగుతున్న టీఆర్ఎస్ ఆధిక్యం... 22వ రౌండ్ లో ఎంతంటే?

సారాంశం

ఇప్పటికే ఇంచుమించు ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 22వ రౌండ్‌లోనూ పైచేయి సాధించాడు.   

నాగార్జునసాగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ విజయానికి మరింత  చేరువయ్యింది. ఇప్పటికే ఇంచుమించు ప్రతి రౌండ్ లోనూ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 22వ రౌండ్‌లోనూ పైచేయి సాధించాడు. 

22వ రౌండ్ ముగిసే సరికి టీఆర్‌ఎస్‌ 16,765 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. 22వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ కు 3783 ఓట్లు. కాంగ్రెస్ కు 2540 ఓట్లు వచ్చాయి. 22వ రౌండ్ లో టీఆర్‌ఎస్‌ లీడ్ 1243గా వుంది.

ఇదిలావుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డికి తన స్వంత మండలంలో కూడ టీఆర్ఎస్ అధిక్యాన్ని దక్కించుకొంది. ఈ మండలంపైనే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఆశలు పెట్టుకొంది.ఈమండలంలో కూడ  కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఓట్లు దక్కలేదు.అనుముల, పెద్దవూరల్లో పెట్టుకున్న కాంగ్రెసు ఆశలు ఆవిరి అ్యయాయి.

నాగార్జునసాగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి కాకుండా మరో అభ్యర్ధిని బరిలోకి దింపితే ఫలితాలు మరోలా  ఉండేదనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. 16 నుండి 20 రౌండ్ల వరకు అనుముల మండలం ఓట్లు లెక్కించారు. ఒక్క రౌండ్ లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి జానారెడ్డికి మెజారిటీ లభించింది. మిగిలిన మూడు రౌండ్లలో కూడ టీఆర్ఎస్ అభ్యర్ధి భగత్ కే ఆధిక్యత లభించింది. 

నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని అనుముల, పెద్దవూర మండలాలపై కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకొంది. అయితే ఈ రెండు మండలాల్లో కూడ టీఆర్ఎస్ కే ఆధిక్యత లభించింది. ఇవే తనకు చివరి ఎన్నికలు అంటూ జానారెడ్డి ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించారు.

అయినా కూడ ప్రజలు ఆయనను ఆశీర్వదించలేదు. ఇదే అసెంబ్లీ స్థానం నుండి జానారెడ్డి ఏడు దఫాలు విజయం సాధించారు. రెండు దఫాలు ఇదే అసెంబ్లీ స్థానం నుండి ఆయన ఓటమి పాలయ్యాడు. యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధుల చేతుల్లోనే జానారెడ్డి ఇప్పటికే రెండు దఫాలు విజయం సాధించారు. 
 


  

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit: రూ.5.75 లక్షల కోట్ల భారీ ఒప్పందాలు.. ప్రపంచ దిగ్గజ సంస్థల క్యూ !
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్