RTC Strike: జీతాల చెల్లింపుపై చేతులెత్తేసిన కేసీఆర్ ప్రభుత్వం

By narsimha lodeFirst Published Oct 21, 2019, 1:51 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికులకు వేతనాల చెల్లింపు విషయమై హైకోర్టులో సోమవారం నాడు విచారణ జరిగింది. ఆర్టీసీ వద్ద రూ. 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు వివరించారు. జీతాల చెల్లింపు కోసం రూ. 224 కోట్లు అవసరమౌతోంది. మరో వైపు ఆర్టీసీ సమ్మెపై దాఖలైన మరో మూడు పిటిషన్లను కలిపి ఈ నెల 28న విచారించనున్నట్టుగా హైకోర్టు తేల్చి చెప్పింది.


హైదరాబాద్: తెలంగాణ  రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మెపై మరో మూడు పిటిషన్లు సోమవారం నాడు హైకోర్టులో దాఖలయ్యాయి. ఈ పిటిసన్లను గతంలో విచారణలో ఉన్న కేసుతో కలిపి ఈ నెల 28న విచారణ చేయనున్నట్టు హైకోర్టు ప్రకటించింది.మరో వైపు కార్మికులకు జీతాలు చెల్లించేందుకు రూ.7 కోట్లు మాత్రమే ఆర్టీసీ వద్ద ఉన్నాయని ప్రభుత్వ తరపు లాయర్ తెలిపారు. 

ప్రగతి భవన్ ముట్టడి: పోలీసుల పద్మవ్యూహాన్ని ఛేదించిన రేవంత్, జగ్గారెడ్డి

ఆర్టీసీ సమ్మెపై సోమవారం నాడు మరో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి.ఈ మూడు పిటిషన్లను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ మూడు పిటిషన్లతో పాటు ఇప్పటికే విచారణలో ఉన్న పిటిషన్‌ను కలిపి ఈ నెల 28వ  తేదీన విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తేల్చి చెప్పింది.

కాంగ్రెస్‌ నేతల హౌస్ అరెస్ట్, రేవంత్ రెడ్డి సహా కీలక నేతల కోసం పోలీసుల గాలింపు

సమ్మెలో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ఈ నెల 21 వ తేదీలోపుగా జీతాలు చెల్లించాలని  ఆర్టీసీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి హైకోర్టు మూడు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఆదేశాలపై సోమవారం నాడు మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది.

సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు వేతనాలు చెల్లించే విషయమై హైకోర్టు ప్రశ్నించింది.ఆర్టీసీ వద్ద రూ. 7.5 కోట్లు మాత్రమే ఉన్నాయని హైకోర్టుకు ప్రభుత్వ తరపు లాయర్ తేల్చి చెప్పారు. ఆర్టీసీ కార్మికులకు వేతనాలు ఇవ్వాలంటే కనీసం రూ.224 కోట్లు అవసరం ఉందని  హైకోర్టుకు ప్రభుత్వ తరపు లాయర్ చెప్పారు. 

ప్రగతి భవన్ ముట్టడి.. బేగంపేట మెట్రో స్టేషన్ మూసివేత

ఈ విషయమై ఇవాళ మధ్యాహ్నం ఈ విషయమై విచారణ చేయనున్నట్టుగా హైకోర్టు తేల్చి చెప్పింది. ఆర్టీసీ కార్మికుల తరపున న్యాయవాది ఈ విషయమై హైకోర్టుకు ఏం చెబుతారనే విషయమై ఆసక్తి నెలకొంది.  సమ్మెలో ఉన్నందున ఆర్టీసీ కార్మికులకు సెప్టెంబర్ మాసం జీతాలు చెల్లించలేదు.

ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ స్వంతంగా ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది.

మరో వైపు ఇవాళ్టి నుండి ఈ నెల 30వ తేదీ వరకు ఆర్టీసీ జేఎసీ, పలు రాజకీయపార్టీలు పలు కార్యక్రమాలను చేపట్టాయి.ఈ నెల 30వ తేదీన సకల జనుల సమరభేీరిని నిర్వహించనున్నారు.సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఈ విషయమై ప్రభుత్వం నుండి ఇంకా ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. 

click me!