కేటీఆర్ రోడ్ షో‌కు వెళుతుండగా తల్లీకూతుళ్ల దుర్మరణం....

Published : Apr 05, 2019, 08:17 PM IST
కేటీఆర్ రోడ్ షో‌కు వెళుతుండగా తల్లీకూతుళ్ల దుర్మరణం....

సారాంశం

లోక్ సభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం మల్కాజిగిరిలో కేటీఆర్ చేపట్టనున్న రోడ్ షో లో హాజరయ్యేందుకు వెళుతూ తల్లీ కూతుళ్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద  సంఘటన లాలాపేట లో చోటుచేసుకుంది. 

లోక్ సభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఈ సందర్భంగా మల్కాజిగిరి పరిధిలో కేటీఆర్ చేపట్టనున్న రోడ్ షో లో హాజరయ్యేందుకు వెళుతూ తల్లీ కూతుళ్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన లాలాపేటలో చోటుచేసుకుంది. 

లాలాపేటకు చెందిన రేష్మ(18) అనే వివాహితకు ఏడాది వయసున్న అమెరిన్ అనే కూతురుంది. అయితే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్ రోడ్ షో లో కూతురితో కలిసి పాల్గొనేందుకు వెళుతుండగా విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతున్న రేష్మ రైలు వస్తున్న విషయాన్ని గమనించలేదు. దీంతో రైలు తల్లీకూతులిద్దరిని ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో తల్లీకూతుళ్లు ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

రియ‌ల్ ఎస్టేట్‌లో ఇలాంటి మోసాలు కూడా జ‌రుగుతాయా.? చ‌నిపోయిన మ‌హిళ పేరుతో రూ. 2.5 కోట్లు స్వాహా
ఇరాన్‌లో బాంబులు పేలితే మ‌న వంటింట్లో మంట‌లు పుడుతున్నాయి.. మొద‌లైన ప్ర‌భావం.