బీఆర్ఎస్ శాసనసభపక్షం, పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: షెడ్యూల్ ప్రకారంగానే ఎన్నికలు జరుగుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు తేల్చి చెప్పారు. శుక్రవారం నాడు శాసనసభపక్షం, బీఆర్ఎస్ విస్తృతస్థాయి సంయుక్త సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నేతలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. ఈ ఏడాది డిసెంబర్ మాసంలో తెలంగాణలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని పార్టీ నేతలకు సూచించారు.ప్రజల్లోకి వెళ్లాలని ఆయన నేతలను కోరారు. వీలైతే పాదయాత్రలు చేయాలని ఆయన సూచించారు. రెండు దపాలుగా రాష్ట్రంలో ప్రజలకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించాలని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు సూచించారు. పార్టీ నేతల మధ్య ఏమైనా విబేధాలుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. పార్టీ బలోపేతం కోసం పార్టీలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
also read:లెజిస్టేటివ్ పార్టీ,బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం: భవిష్యత్తుపై కేసీఆర్ దిశా నిర్ధేశం
ఈ ఏడాది అక్టోబర్ లో బీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించనున్నట్టుగా చెప్పారు. ఎన్నికలకు సంబంధించి సర్వే ఫలితాల గురించి కేసీఆర్ సూచన ప్రాయంగా ఈ సమావేశంలో వివరించారు. గతంలో చెప్పినట్టుగానే సర్వే ఫలితాలు వస్తాయని కేసీఆర్ ప్రకటించారు.ఇక నుండి టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుండయని కేసీఆర్ ప్రకటించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలుంటాయని ఆయ న చెప్పారు. త్వరలో వరంగల్ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.