
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టిన దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తాను చేపట్టిన దీక్షకు మద్ధతు తెలిపిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇది ఒక్క రాష్ట్రానికి సంబంధించిన సమస్య కాదని కవిత అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. మోడీ సర్కార్ తలుచుకుంటే ఈ బిల్ పాసవుతుందని కవిత అన్నారు. డిసెంబర్‌లో పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు తాము పోరాడుతూనే వుంటామని ఆమె స్పష్టం చేశారు. రాష్ట్రపతికి కూడా తాము విజ్ఞప్తి చేస్తున్నామని.. ఇవాళ ప్రారంభించిన ఈ పోరాటం ఇంకా ఉద్ధృతం అవుతుందన్నారు.