లెజిస్టేటివ్ పార్టీ,బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం: భవిష్యత్తుపై కేసీఆర్ దిశా నిర్ధేశం

By narsimha lode  |  First Published Mar 10, 2023, 4:23 PM IST

రానున్న రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  చర్చించేందుకు బీఆర్ఎస్  శాసనససభపక్షం,  పార్టీ విస్తృతస్థాయి సమావేశం   ఇవాళ  హైద్రాబాద్ లో జరిగింది. పార్టీ నేతలకు  కేసీఆర్ దిశానిర్ధేశం  చేశారు.


హైదరాబాద్:  బీఆర్ఎస్  శాసనసభపక్షం,   ఆ పార్టీ  విస్తృత స్థాయి  సంయుక్త సమావేశం  శుక్రవారంనాడు  తెలంగాణ భవన్ లో  ప్రారంభమైంది.ఈ సమావేశానికి  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అధ్యక్షత వహించారు. 

సమావేశానికి ముందుగా  ఇటీవల అనారోగ్యంతో మరణించిన  కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి  కేసీఆర్ సహా  పార్టీ నేతలు  నివాళులర్పించారు.  
 రాష్ట్ర ప్రభుత్వం అమలు  చేస్తున్న పథకాలు , రానున్న రోజుల్లో తీసుకోవాల్సిన కార్యక్రమాలపై  సమావేశంలో  చర్చించనున్నారు. మరో వైపు  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు  ఈడీ నోటీసుల అంశంపై  చర్చించనున్నారు. 

Latest Videos

బీజేపీపై  పోరాటం ఏ రకంగా తీసుకెళ్లాలనే దానిపై   బీఆర్ఎస్  నేతలకు కేసీఆర్ దిశా నిర్ధేశం  చేయనున్నారు. బీజేపీపై పోరాటం  ప్రారంభించిన సమయంలోనే   ఈడీ, సీబీఐ, ఐటీ కేసులు  ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధులకు  చెప్పారు. రానున్న రోజుల్లో  ఈ  దాడులు  మరింత  పెరిగే అవకాశం ఉంది. దీంతో   వీటిని  ఎలా ఎదుర్కోవాలనే విషయమై  చర్చించనున్నారు.

 బీజేపీ  వ్యవహరిస్తున్న తీరుపై  ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే దానిపై  చర్చించి  కార్యాచరణను రూపొందించనున్నారు.  ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి  ఎన్నికలు రానున్నాయి. ఈ  తరుణంలో  ఓటర్లను  ఆకర్షించేందుకు  తీసుకోవాల్సిన పథకాలపై  కూడా  ఈ సమావేశంలో  చర్చ జరిగే  అవకాశం లేకపోలేదు.

tags
click me!