ఈటల భార్య పేరుతో నిర్మించిన గోడౌన్లకు అనుమతుల్లేవ్: కొనసాగుతున్న దర్యాప్తు

By narsimha lodeFirst Published May 6, 2021, 11:08 AM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్  భార్య  జమున పేరిట  నిర్మించిన గోదాముల్లో ఎలాంటి అనుమతులు లేవని  ఏసీబీ, విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

హైదరాబాద్:మాజీ మంత్రి ఈటల రాజేందర్  భార్య  జమున పేరిట  నిర్మించిన గోదాముల్లో ఎలాంటి అనుమతులు లేవని  ఏసీబీ, విజిలెన్స్ అధికారులు గుర్తించారు.శామీర్‌పేట మండలం దేవరయంజాల్ శ్రీసీతారామస్వామి దేవాలయ భూముల్లో 219 గోదాములు నిర్మించారు. వీటిల్లో మూడు గోడౌన్లకు మాత్రమే అనుమతులు ఉన్నాయని అధికారులు గుర్తించారు.మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య జమున  పేరున 6.28 ఎకరాల్లో గోడౌన్లు నిర్మించినట్టుగా  అధికారులు గుర్తించారు.

also read:ఆయనకు కేసీఆర్ ఎన్నో అవకాశాలిచ్చారు: ఈటల వ్యవహారంపై కెప్టెన్ లక్ష్మీకాంతరావు కామెంట్స్

ఈ గోడౌన్లకు ఎంత అద్దె చెల్లిస్తున్నారు, ఖాళీ స్థలం ఎంత ఉంది అనే విషయాలపై కూడ  అధికారులు వివరాలు సేకరించారు.ఏసీబీ, విజిలెన్స్ అధికారులు  మూడు రోజులుగా ఈ భూముల్లో విచారణ నిర్వహిస్తున్నారు. గ్రామపంచాయితీగా ఉన్న సమయంలో కొందరు రాజకీయనాయకులు ఈ భూముల్లో గోడౌన్లు నిర్మించి పలు సంస్థలకు అద్దెకిచ్చారని గుర్తించారు.అనుమతులు లేకుండా నిర్మించిన ఈ గోడౌన్లకు మున్పిపాలిటీ అధికారులు పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ విషయమై విజిలెన్స్, ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.  భూములను ఆక్రమరించారనే ఆరోపణల నేపథ్యంలో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుండి కేసీఆర్ తప్పించారు.

click me!