ఈసీకి లేఖపై వివాదం:అజ్ఞాతంలోకి బండి సంజయ్, పాతబస్తీలో టెన్షన్

By narsimha lodeFirst Published Nov 20, 2020, 10:20 AM IST
Highlights

జంట నగరాల్లో వరద సహాయాన్ని నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాను రాసినట్టుగా చెబుతున్న లేఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశాడు.
 

హైదరాబాద్:  హైదరాబాదు వరద బాధితులకు సాయం ఆపేయాలంటూ బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఎన్నికల కమిషన్ కు రాసినట్లు చెబుతున్న లేఖపై తీవ్ర వివాదం చోటు చేసుకుంది. వరద సాయాన్ని ఆపేయాలంటూ బిజెపి లేఖ రాసిందంటూ కేసీఆర్ విమర్శలు చేసిన నేపథ్యంలో  బండి సంజయ్ సవాల్ విసిరారు. తాను లేఖ రాయలేదని చెబుతూ ఆ విషయంపై భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలని ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు.

ప్రమాణం చేయడానికి తాను ఈ రోజు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ఉంటానని బండి సంజయ్ చెప్పారు. అయితే, భాగ్యలక్ష్మి ఆలయంలోకి రావడానికి బండి సంజయ్ కు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. ఈ స్థితిలో బండి సంజయ్ అజ్ఢాతంలోకి వెళ్లారు. అకస్మాత్తుగా ఎక్కుడి నుంచైనా సంజయ్ ఆలయానికి రావచ్చుననే ఉద్దేశంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బండి సంజయ్ ఆచూకీ కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.బిజెపి కార్యాలయం వద్ద పోలీసులు బారీ భద్రతను ఏర్పాటు చేశారు. కార్యాలయం చుట్టుపక్కల బారికేడ్లు వేశారు. 

జంట నగరాల్లో వరద సహాయాన్ని నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి తాను రాసినట్టుగా చెబుతున్న లేఖపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదు చేశాడు.బీజేపీ నేతల ఫిర్యాదు మేరకు ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బీజేపీ నేతల ఫిర్యాదు మేరకే వరద సహాయాన్ని నిలిపివేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిలిపివేసిందని  తెలంగాణ సీఎం కేసీఆర్ పార్టీ ప్రజా ప్రతినిధుల సమావేశంలో ప్రకటించారు.

బీజేపీ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ లేఖపై దర్యాప్తు చేస్తున్నారు. బండి సంజయ్ రాసినట్టుగా చెబుతున్న లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే.

మరో వైపు ఈ లేఖ తాను రాయలేదని బండి సంజయ్ ప్రకటించారు. ఈ లేఖను తాను రాసినట్టుగా రుజువు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద ప్రమాణం చేయాలని ఆయన కేసీఆర్ కు సవాల్ విసిరారు. 

ఇవాళ ఉదయం 12 గంటలకు తాను చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బీజేపీ బైక్ ర్యాలీకి పిలుపునిచ్చింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో  బైక్ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.

also read:అప్పుడుకాంగ్రెస్ బొక్కబోర్లా: పవన్ తో పొత్తుకు బిజెపి నిరాకరణ వెనక...

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు బీజేపీ బైక్ ర్యాలీకి పిలుపునివ్వడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకొన్నారు.

హైద్రాబాద్ బీజేపీ కార్యాలయానికి వచ్చే మార్గాలను పోలీసులు మూసివేశారు.  బీజేపీ నేతలు చార్మినార్  భాగ్యలక్ష్మి  ఆలయం వైపునకు వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

click me!