జీహెచ్ఎంసీ ఎన్నికలు: బంజి సంజయ్ లేఖపై పోలీసుల ఆరా

By telugu teamFirst Published Nov 20, 2020, 10:10 AM IST
Highlights

హైదరాబాదు వరద బాధితులకు సాయం ఆపేయాలంటూ తెలంాగణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాసినట్లు చెబుతున్న లేఖపై పోలీసుుల దర్యాప్తు చేపట్టారు. ఆ లేఖపై బిజెపి నేతలు లీగల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్: హైదరాబాదులోని వరద బాధితులకు సాయం నిలిపివేయాలంటూ తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాశాడని చెబుతున్న లేఖపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వరద బాధితులకు సాయం ఆపేయాలంటూ బండి సంజయ్ రాసినట్లు చెబుతున్న లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాంతో బిజెపి చిక్కుల్లో పడింది. 

సాయం నిలిపేయగానే వరద బాధితులు హైదరాాబదులోని పలు చోట్ల ఆందోళనకు దిగారు. ఆ ప్రభావం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో బిజెపి నాయకులు ఆందోళన చెందుతున్నారు. బండి సంజయ్ రాసినట్లు చెబుతున్న లేఖపై లీగల్ సెల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Also Re3ad: ఆగిన వరద బాధితుల డబ్బులు... ఎన్నికల కమిషన్ కి బండి సంజయ్ లేఖే కారణమా?? సోషల్ మీడియాలో వైరల్...

దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బండి సంజయ్ రాసినట్లు చెబుతున్న లేఖపై ఉన్న సంతకాన్ని పోలీసులు పరిశీలించారు. లేఖను సర్క్యులేట్ చేస్తున్నవారి గురించి ఆరా తీస్తున్నారు. 

ఆ లేఖ తాను రాయలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆయన ఆరోపించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి కెసీఆర్ కు ఆయన సవాల్ విసిరారు. చార్మినార్ సమీపంలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ఆ విషయాన్ని తేల్చుకుందామని ఆయన ఆయన కేసీర్ ను సవాల్ చేశారు. 

Also Read: వరద సాయం నిలిపివేత: కేసీఆర్ విమర్శలను తిప్పికొట్టిన బండి సంజయ్

బండి సంజయ్ ఈసీకి లేఖ రాయడం వల్ల వరద బాధితులకు సాయం అందించలేకపోతున్నామని, వరద సాయాన్ని బిజెపి అడ్డుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట కవిత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 

click me!