Gandhi Hospital Gang Rape : 500కి పైగా సీసీ కెమెరాలు పరిశీలించాం.. కేసులో మిస్టరీ ఏం లేదు...సీపీ అంజనీ కుమార్

By AN TeluguFirst Published Aug 19, 2021, 5:07 PM IST
Highlights

టెక్నాలజీ ఆధారంగా... సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు సీపీ అంజనీ కుమార్ పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు. క్రైమ్ విషయంలో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూడదని, పార్లమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార ఘటన మీద సీపీ అంజనీ కుమార్ స్పందించారు. 500కి పైగా సీసీ కెమురాలు పరిశీలించినట్లు ఆయన తెలిపారు. దాదాపు 800 గంటల సీసీ ఫుటేజ్ లు చూశామని అన్నారు. 

టెక్నాలజీ ఆధారంగా... సెల్ ఫోన్ సిగ్నల్స్ చూసినట్లు పేర్కొన్నారు. ఇది చాలా సెన్సిటివ్ కేసు అని ఆయన అన్నారు. క్రైమ్ విషయంలో మహిళల గురించి తప్పుగా మాట్లాడకూడదని, పార్లమెంట్ నుంచి ఆర్డర్స్ ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 

క్రైమ్ లో సీన్ రీ క్రియేషన్ చాలా ముఖ్యమని, ప్రతి వ్యక్తికి పర్సనల్ విషయాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. లా ప్రకారం.. ఏసపీ ర్యాంక్ ఉన్న ఆఫీసర్ ఇన్వెస్టిగేటింగ్ చేయాలి, ఈ కేసులో మిస్టరీ ఏం లేదన్నారు. కోర్టులో కేసు వివరాలు ఎలా సబ్మిట్ చేయాలి అని చూస్తున్నట్లు వెల్లడించారు. 

కాగా, గాంధీ ఆస్పత్రిలో తనతో పాటు తన సోదరిపైనా సామూహిక అత్యాచారం జరిగిందంటూ ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న నార్త్ జోన్ పోలీసులు 10 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళను నారాయణగూడలో ఉన్నట్లు గురువారం గుర్తించారు. 

అదృశ్యమైన మహిళ రెండు రోజులుగా ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసులు నిర్థారించారు. అయితే, మహిళకు ఆశ్రయం ఇచ్చిన సదరు వ్యక్తిన అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు. 

కాగా, గాంధీ ఆసుపత్రి గ్యాంగ్ రేప్ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు.  గ్యాంగ్ రేప్ ఘటన వెలుగు చూసిన తర్వాత కన్పించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఘటన జరిగిన రోజున విజయ్ అనే సెక్యూరిటీ గార్డుతో బాధిత మహిళ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. బాధితురాలు అతనితో  వెళ్లిన తర్వాత చోటు చేసుకొన్న ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఆచూకీ కన్పించకుండా పోయిన బాధిత మహిళను నారాయణగూడలో ఇవాళ పోలీసులు గుర్తించారు. 

అక్కా చెల్లెళ్లపై గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి విజయ్ తో పాటు ఇంకా ఎవరెవరు పాల్గొన్నారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే ఈ విషయమై గాంధీ ఆసుపత్రిలో రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న ఉమామహేశ్వర్ సహా మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మహిళ తన భర్తకు కిడ్నీ చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి వచ్చింది. ఆ సమయంలో తనకు తోడుగా చెల్లిని కూడ తెచ్చుకొంది.

అయితే గాంధీ ఆసుపత్రిలో అక్కా చెల్లెళ్లపై  గ్యాంగ్ రేప్ ఘటనపై 10 పోలీస్ బృందాలు విచారణ చేస్తున్నారు
 

click me!