శాతవాహన యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్ లీక్... వాట్సాప్ గ్రూప్స్ లో చక్కర్లు (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 19, 2021, 4:05 PM IST
Highlights

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీకయ్యింది. పరీక్షా సమయానికి కంటే ముందే విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం ప్రత్యక్షమయ్యింది.  

కరీంనగర్ జిల్లాలోని శాతవాహన యూనివర్సిటీలో పరీక్షలకు ముందే క్వశ్చన్ పేపర్ లీకయిన ఘటన బయటపడింది. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 6వ సెమిస్టర్ భౌతికశాస్త్రం పరీక్ష జరిగింది. అయితే  పరీక్ష్ సమయానికంటే ముందే పేపర్ లీకయిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చిది.  

పరీక్ష సమయానికి ముందు విద్యార్థుల వాట్సాప్ గ్రూప్ లో క్వశ్చన్ పేపర్ ప్రత్యక్షమయ్యింది. ఈ విషయం గురించి తెలియడంతో సీరియస్ అయిన యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ఎక్కడి నుంచి పేపర్ లీక్ అయ్యిందన్న దానిపై ఆరా తీస్తున్నారు. 

వీడియో

ఈ క్వశ్చన్ పేపర్ లీకేజీకి సంబంధించి తొమ్మిది మంది విద్యార్థుల సెల్ ఫోన్లను ఇప్పటికే యూనివర్సిటీ అధికారులు సీజ్ చేశారు. ప్రశ్నపత్రం ఎలా బయటకు వచ్చిదన్న విషయం తెలుసుకునేందుకు ప్రత్యేక కమిటీ ద్వారా విచారణ చేపట్టారు. 

క్వశ్చర్ పేపర్ లీకేజీని సీరియస్ గా తీసుకున్న యూనివర్సిటీ అధికారులు కరీంనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుంగా చర్యలు తీసుకుంటున్నారు యూనివర్సిటీ అధికారులు. 
 

click me!