జూబ్లీహిల్స్ పబ్‌లకే రాత్రి 10 దాటితే నో మ్యూజిక్ : తెలంగాణ హైకోర్టు

By narsimha lode  |  First Published Oct 31, 2022, 2:30 PM IST

రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో మ్యూజిక్ నిలిపివేయాలనిహైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్ లకు మాత్రమే వర్తిస్తాయని హైకోర్టు తీర్పును వెల్లడించింది.


హైదరాబాద్: రాత్రి 10 గంటల తర్వాత పబ్ లలో మ్యూజిక్ ను నిలిపివేయాలని గతంలో ఇచ్చిన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు జూబ్లీహిల్స్ లోని పబ్ లకు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు డివిజన్ బెంచ్  తీర్పును చెప్పింది.

పబ్ లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, హైద్రాబాద్ రెస్ట్రోలాంబ్ అసోసియేషన్ లు హైకోర్టు డివిజన్ బెంచ్  లో సవాల్  చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు డివిజన్ చెంచ్  గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలు జూబ్లీహిల్స్ పరిధిలోని పబ్ లకు మాత్రమే వర్తిస్తుందని  హైకోర్టు డివిజన్ చెంచ్ సోమవారంనాడు ఆదేశాలు  జారీచేసిందని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

Latest Videos

undefined

ఈ ఏడాది సెప్టెంబర్ 26న పబ్ లపై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్ ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు మైనర్లను కూడ పబ్ లలోకి అనుమతివ్వవద్దని కూడ హైకోర్టు ఆదేశించింది.పబ్ ల విషయమై తీసుకున్న చర్యలపై నివేదికలను ఇవ్వాలని ముగ్గురు పోలీసు కమిషనర్లను ,జీహెచ్ఎంసీ కమిషనర్ ను హైకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్ 21న ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఈ ఏడాది సెప్టెంబర్ 26న ముగ్గురు పోలీస్ కమిషనర్లు,జీహెచ్ఎంసీ కమిషనర్ తమ నివేదికలను కోర్టు ముందుంచారు.

also read:నిబంధనలు పాటించకపోతే కేసులు : పబ్‌లపై పోలీసులకు హైకోర్టు ఆదేశం

జూబ్లీహిల్స్ రెసిడెంట్స్ క్లీన్ గ్రీన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటరమణ సూర్యదేవర దాఖలు చేసిన పిటిషన్ పై  హైకోర్టు విచారించింది. నివాస ప్రాంతాలు  విద్యాసంస్థలకు సమీపంలో పబ్ లను అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

click me!