ఆ రెండు మందు బిళ్లలతో కరోనా నుండి బయటపడ్డా: కేసీఆర్

Published : Jun 21, 2021, 04:18 PM ISTUpdated : Jun 21, 2021, 04:22 PM IST
ఆ రెండు మందు బిళ్లలతో కరోనా నుండి బయటపడ్డా: కేసీఆర్

సారాంశం

కరోనాకు మందు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా వచ్చిన సమయంలో తాను కూడ డోలో తో పాటు మరో మందు బిళ్ల వేసుకొన్నానని సీఎం  వివరించారు.  

వరంగల్: కరోనాకు మందు లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కరోనా వచ్చిన సమయంలో తాను కూడ డోలో తో పాటు మరో మందు బిళ్ల వేసుకొన్నానని సీఎం  వివరించారు.వరంగల్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ సోమవారం నాడు   పాల్గొన్నారు. కరోనా వస్తే టెంపరేచర్ పెరుగుతోందన్నారు. తనకు కూడ కరోనా వచ్చిన సమయంలో  తీసుకొన్న ట్రీట్ మెంట్ గురించి ఆయన వివరించారు. కరోనా సమయంలో  బాగా జ్వరం వస్తోందన్నారు. జ్వరం వచ్చిన సమయంలో  డాక్టర్ సలహా మేరకు  డోలో టాబ్లెట్ తో పాటు  యాంటీ బయాటిక్ మందులను ఉపయోగించుకొంటే కరోనా  తగ్గిపోతోందన్నారు. 

also read:సెంట్రల్ జైలు కూలిస్తే నాకేమొస్తది: వరంగల్ లో కేసీఆర్

తాను కూడ ఈ రెండు రకాలైన మందులను మాత్రమే వాడానని ఆయన చెప్పారు. తనకు డీ విటమిన్ టాబ్లెట్ ఇస్తే ఉపయోగించలేదన్నారు. వారం రోజుల్లోనే  తాను కరోనా నుండి కోలుకొన్నానని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.  కరోనాకు మందే లేదన్నారు. కరోనా సోకిన సమయంలో  తాను ఈ విషయమై డాక్టర్లతో చర్చించినట్టుగా చెప్పారు. తన బంధువులకు  కరోనా సోకితే స్టైరాయిడ్లు  వాడడంతో  అతను ఊభకాయుడిగా మారినట్టుగా సీజేఐ రమణ తనతో చెప్పారని కేసీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే