వరంగల్ లోని 200 ఎకరాల స్థలాన్నిహెల్త్ హబ్ గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నర కాలంలో ఈ ఆసుపత్రిని నిర్మించాలని కోరారు.
వరంగల్: వరంగల్ లోని 200 ఎకరాల స్థలాన్నిహెల్త్ హబ్ గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నర కాలంలో ఈ ఆసుపత్రిని నిర్మించాలని కోరారు.వరంగల్ లో పలు అభివృద్ది కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. పైరవీలు, గందరగోళం లేకుండా చేస్తే మంచి పాలన అందించినట్టేనని సీఎం చెప్పారు. వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్టుగా సీఎం ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెల్లడికానున్నాయని ఆయన తెలిపారు. వరంగల్ కలెక్టరేట్ ను కూడ త్వరలోనే నిర్మిస్తామన్నారు.ఈ మేరకు అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం సీఎస్ సోమేష్ కుమార్ ను ఆదేశించారు.
also read:వరంగల్‌లో మల్టీలెవల్ స్పెషాలిటీ ఆసుపత్రికి కేసీఆర్ శంకుస్థాపన
బ్రిటీష్ పాలనలో . రెవిన్యూను కలెక్ట్ చేసేవారిని కలెక్టర్లుగా నియమించుకొన్నారని సీఎం గుర్తు చేశారు. కలెక్టర్ల పేర్లను మార్చాలని సీఎం అభిప్రాయపడ్డారు. వరంగల్ పరిశ్రమల కేంద్రంతో పాటు విద్యా, వైద్య కేంద్రంగా విలసిల్లాల్సిన అవసరం ఉందని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచంలోనే వైద్య సేవలు కెనడాలోనే బాగున్నాయని అంటున్నారన్నారు. కెనడాకు వెళ్లి వైద్య సేవలు, భవనాల పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ కోరారు. వరంగల్ లో వైద్య విభాగం అన్ని రకాలుగా అభివృద్ది చెందాల్సిన అవసరం ఉందన్నారు. వరంగల్ లోని 200 ఎకరాల స్థలంలో హెల్త్ హబ్ గా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. ఏడాదిన్నర కాలంలో ఈ ఆసుపత్రిని నిర్మించాలని సీఎం కోరారు.
రాష్ట్రంలోని పాత తాలుకా కేంద్రాల్లో మాతా శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్నాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. హైద్రాబాద్ వాళ్లు ఈర్ష్యపడేలా వరంగల్ కేంద్రంగా వైద్య సదుపాయాలను ఏర్పాటు చేయాలన్నారు.వరంగల్ లో సెంట్రల్ జైలు కూల్చితే నాకేమైనా వచ్చేడా అని ఆయన ప్రశ్నించారు.ఈ విషయమై కూడ కొందరు తనను విమర్శించారని కేసీఆర్ గుర్తు చేశారు.