జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. కాటారం మండలం గంగారంలో ఈ దారుణం జరిగింది. భూతగాదాల నేపథ్యంలో ముగ్గురి హత్య స్థానికంగా కలకలం రేపింది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భూ తగాదాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. కాటారం మండలం గంగారంలో ఈ దారుణం జరిగింది. భూతగాదాల నేపథ్యంలో ముగ్గురి హత్య స్థానికంగా కలకలం రేపింది.
ఇరువర్గాలు సోమవారం నాడు పత్తి చేన్ల వద్ద గొడవ పడ్డారు. ఒకరి మీద ఒకరు ఆయుధాలతో దాడులకు తెగబడ్డారు. ఒక వర్గం వారు గొడ్డళ్లతో దాడి చేసి ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను దుండగులు చంపారు.
ఆరెకరాల పొలం కొలతల విషయంలో వీరి మధ్య గత కొద్దిసంవత్సరాలుగా ఘర్షణ నడుస్తోంది. ఈ కేసు కోర్టులో పెండింగ్ లో ఉంది.
స్థానికులు అందించిన సమాచారం మేరకు పోలీసులు హత్యాస్థలానికి చేరుకున్నారు. హంతకుల కోసం గాలింపు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్రం ఆస్పత్రికి తరలించారు.