రీ పోస్టుమార్టం: దిశ నిందితుల డెడ్‌బాడీలకు నో ఎంబామింగ్

By narsimha lodeFirst Published Dec 23, 2019, 1:15 PM IST
Highlights

దిశ నిందితుల మృతదేహాలకు ఎంబామింగ్ చేయలేదని వైద్యులు తేల్చి చెప్పారు రీ పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందించనున్నట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ తేల్చి చెప్పారు. 

హైదరాబాద్: దిశ నిందితుల  మృతదేహాలకు ఎంబామింగ్ చేయలేదు.  శీతాకాలం కావడంతో ఫ్రీజర్‌లో మైనస్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మృతదేహాలను భద్రపర్చినప్పటికీ 50 శాతం కుళ్లిపోయాయి వేసవి కాలమైతే పూర్తిగా కుళ్లిపోయేవని వైద్యులు చెబుతున్నారు. 

Also read: గాంధీకి చేరుకొన్న దిశ నిందితుల కుటుంబాలు, ఒక్కొక్కరికి గంటన్నర టైమ్

ఈ నెల 6వ తేదీన చటాన్‌పల్లి వద్ద అండర్ పాస్ బ్రిడ్జి వద్ద సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసే సమయంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దిశ కేసులో నలుగురు నిందితులు మహ్మాద్ ఆరిఫ్, చెన్నకేశవులు, నవీన్,  శివలు మృతి చెందారు.

also read:దిశ నిందితుల మృతదేహాలకు ప్రారంభమైన రీ పోస్టుమార్టం

హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాల మేరకు ఈ నాలుగు మృతదేహాలను భద్రపర్చారు. తొలుత మహాబూబ్‌నగర్ ఆసుపత్రిలో ఆ తర్వాత  గాంధీ ఆసుపత్రిలో ఈ నాలుగు మృతదేహాలను భద్రపర్చారు.

Also read:దిశ నిందితుల మృతదేహాలు 50 శాతం కుళ్లిపోయాయి: హైకోర్టుకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్

ఈ నెల 21వ తేదీన నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.ఈ ఆదేశాల మేరకు గాంధీ ఆసుపత్రిలో ఈ నెల 23వ తేదీన ఉదయం గాంధీ ఆసుపత్రి మార్చురీలో రీ పోస్టుమార్టం ప్రారంభమైంది.

Also read:దిశ నిందితులు: చెన్నకేశవులు భార్య కూడ మైనరే

నిందితలు మృతదేహాలకు ఎంబామింగ్ చేయలేదని గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ స్పష్టం చేశారు. తొలుత  నిందితుల మృతదేహాలను కుటుంబసభ్యులకు చూపించారు. కుటుంబసభ్యులు  ఆ మృతదేహాలు తమవేవని స్పష్టం చేసిన తర్వాత ఎయిమ్స్ వైద్యులు రీపోస్టుమార్టం ప్రారంభించారు.

Also Read:దిశ నిందితుల ఎన్‌కౌంటర్: మృతదేహాల అప్పగింతపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

నిందితుల కుటుంబసభ్యలు మృతదేహాలు తమవేనని చెప్పిన ప్రక్రియ నుండి రీ పోస్టుమార్టం పూర్తి చేసే వరకు  రికార్డింగ్ చేయనున్నారు. నిందితుల మృతదేహాలకు చటాన్‌పల్లి వద్ద ఈ నెల 6వ తేదీన నిర్వహించిన పోస్టుమార్టం రికార్డింగ్ సీడీని తెలంగాణ హైకోర్టుకు సమర్పించారు.

ఇవాళ జరుగుతున్న రీ పోస్టుమార్టం రికార్డులను కూడ హైకోర్టుకు సమర్పించనున్నారు. ఎయిమ్స్ ఫోరెన్సిక్ నిపుణుల బృందం మాత్రమే మార్చురీలో ఉంటున్నారు. స్థానికంగా ఉన్న వైద్య బృందం మాత్రం రీపోస్టుమార్టం ప్రక్రియకు దూరంగా ఉంటున్నారు.

ఎయిమ్స్ వైద్యులకు అవసరమైన హ్యాండీకామ్, కంప్యూటర్‌ను గాంధీ ఆసుపత్రి సిబ్బంది అందించారు.మృతదేహాలకు ఎక్స్‌రే నిర్వహించినట్టుగా వైద్యులు ప్రకటించారు. రీ పోస్టుమార్టం రిపోర్టును సీల్డ్ కవర్లో హైకోర్టుకు అందిస్తామని గాంధీ ఆసుపత్రి సూపరింటెండ్ శ్రవణ్ ప్రకటించారు.


 

click me!