తెలంగాణలో టీడీపీతో పోత్తు: తేల్చేసిన బీజేపీ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్

By narsimha lode  |  First Published Jan 13, 2023, 2:26 PM IST

వచ్చే ఎన్నికల్లో  తెలంగాణలో  టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని జరుగుతున్న ప్రచారాన్ని  బీజేపీ  రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్  ఖండించారు.  


హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ను ఓడించే సత్తా బీజేపీకే ఉందని  ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్  చెప్పారు. శుక్రవారం నాడు  తరుణ్ చుగ్  మీడియాకు  ఓ ప్రకటనను విడుదల చేశారు.  తెలంగాణలో టీడీపీతో  బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని  మీడియాలో  వచ్చిన వార్తలను ఆయన  ఖండించారు.   తెలంగాణలో వైఎస్ షర్మిల  ఏర్పాటు  చేసిన వైఎస్ఆర్‌టీపీ మద్దతు విషయమై  తాను  ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని  తురుణ్ చుగ్  వవరణ ఇచ్చారు.  తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని  ఆయన  మీడియాను కోరారు.  రాష్ట్రంలో పునాదిని కోల్పోయిన  పార్టీలు  ఈ రకమైన ప్రచారం చేస్తున్నాయన్నారు.  తమ పార్టీపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తరుణ్ చుగ్  తప్పుబట్టారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో  వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వీజేపీలు కలిసి పోటీ చేసే  అవకాశం ఉందని  ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారాన్ని బీజేపీ నేతలు ఖండించారు.  తెలంగాణలో  పార్టీని బలోపేతం  చేసే దిశగా  చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాదిలో  ఖమ్మం  జిల్లాలో  చంద్రబబు సభ నిర్వహించారు. ఈ సభ విజయవంతం కావడంతో ఇతర జిల్లాల్లో కూడ  సభలు నిర్వహించాలని  టీడీపీ భావిస్తుంది.  రానున్న రోజుల్లో నిజామాబాద్ లో  సభ నిర్వహించాలని  టీడీపీ నిర్ణయం తీసుకుంది.  ఇతర పార్టీల్లో చేరినవారంతా తిరిగి టీడీపీలో  చేరాలని చంద్రబాబు  ఆహ్వానం పలికారు.  

Latest Videos

ఏపీలో  వచ్చే ఎన్నికల్లో  జనసేన, టీడీపీ కలిసి పోటీచేస్తాయనే  ప్రచారాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం  చేస్తున్నారు. అయితే వైసీపీ, టీడీపీకి తాము సమదూరం పాటిస్తామని బీజేపీ నేతలు  చెబుతున్నారు.  అయితే  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మాత్రం  టీడీపీతో  కలిసి వెళ్లే అవకాశం ఉందనే  సంకేతాలు  ఇస్తున్నారని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 2014లో మాదిరిగా  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో  బీజేపీ, టీడీపీ, జనసేనలు కలిసి పోటీ చేసే  అవకాశం ఉందనే  ప్రచారం సాగుతుంది.  2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు.  బీజేపీ, టీడీపీ అభ్యర్ధులకు  పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారు.తెలంగాణలో  టీడీపీతో  పొత్తును బీజేపీ నేతలు  వ్యతిరేకిస్తున్నారు. తెలంగాణలో  అసలు ఉనికే  లేకుండా ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏం ప్రయోజనమని  కూడా కమలం నేతలు  ప్రశ్నిస్తున్నారు. 

click me!