హైద్రాబాద్ లో జాబ్స్‌ పేరుతో మోసం : మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిన బాధితులు

By narsimha lode  |  First Published Feb 15, 2023, 2:41 PM IST

ఉద్యోగాలు ఇప్పిస్తామని  చెప్పి   మోసం  చేసిన దంపతులపై  చర్యలు తీసుకోవాలని  నిరుద్యోగులు  కోరుతున్నారు.  ఈ విషయమై హైద్రాబాద్  మానవ హక్కుల సంఘాన్ని  బాధితులు  ఆశ్రయించారు. 


హైదరాబాద్: సాఫ్ట్ వేర్ కంపెనీల్లో  ఉద్యోగాలు ఇప్పిస్తామని  నిరుద్యోగుల  నుండి రూ.  42 లక్షలు వసూలు  చేశారు  దంపతులు.  హైద్రాబాద్ లో  నివాసం ఉంటున్న  దంపతులు   బెంగుళూరులోని టెక్ కంపెనీల్లో  ఉద్యోగాలు ఇప్పిస్తామని    నిరుద్యోగులను మోసం  చేశారు.  ఈ దంపతులపై    చర్యలు తీసుకోవాలని బాధితులు  బుధవారంనాడు హైద్రాబాద్ మానవ హక్కుల  సంఘాన్ని ఆశ్రయించారు. 

ఏపీ రాష్ట్రానికి  చెందిన  చంద్రశేఖర్, సుమ  దంపతులు.  హైద్రాబాద్ ఎల్ బీ నగర్ లో నివాసం ఉంటున్నారు.   ప్రముఖ  సాఫ్ట్ వేర్ కంపెనీల్లో  ఉద్యోగాలు  ఇప్పిస్తామని  చెప్పి   నలుగురి నుండి  రూ. 42 లక్షలను  వసూలు  చేశారు.  నెలలు దాటినా  కూడా  ఉద్యోగాలు రాలేదు.  ఈ విషయమై  బాధితులు  చంద్రశేఖర్ దంపతులను  సంప్రదించారు. అయినా కూడా  తమకు  సరైన  సమాధానం రాలేదని  బాధితులు  ఆరోపిస్తున్నారు.ఈ విషయమై  ఎల్ బీ నగర్ పోలీస్ స్టేషన్ లో  పిర్యాదు చేసినా  తమకు  న్యాయం జరగలేదని  బాధితులు చెబుతున్నారు.   తమకు న్యాయం చేయాలని కోరుతూ  బాధితులు   హైద్రాబాద్ లో  మానవ హక్కుల సంఘాన్ని  ఆశ్రయించారు.  తాము  ఇచ్చిన  రూ.  42 లక్షలను  తిరిగి తమకు  దక్కేలా  చూడాలని   బాధితులు కోరుతున్నారు. 

Latest Videos

 

click me!