నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భార్యకూ కరోనా

Published : Jun 19, 2020, 10:24 AM ISTUpdated : Jun 19, 2020, 10:32 AM IST
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భార్యకూ కరోనా

సారాంశం

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భార్యకు కూడ కరోనా సోకింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా నిర్ధారణ అయినట్టుగా అధికారులు ప్రకటించారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ భార్యకు కూడ కరోనా సోకింది. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు నెగిటివ్ వచ్చింది. తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఆమెకు కరోనా నిర్ధారణ అయినట్టుగా అధికారులు ప్రకటించారు.

also read:నిజామాబాద్‌జిల్లాలో మరో ఎమ్మెల్యేకి కరోనా: గణేష్ గుప్తాకి కోవిడ్

ఈ నెల 14వ తేదీన  బాజిరెడ్డి గోవర్ధన్ కు కరోనా సోకినట్టుగా వైద్యులు గుర్తించారు. కరోనా చికిత్స కోసం ఆయన నిజామాబాద్ నుండి హైద్రాబాద్ కు వచ్చారు. హైద్రాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

ఆసుపత్రిలో తాను ఆరోగ్యంగా ఉన్నట్టుగా బాజిరెడ్డి గోవర్ధన్  ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన ఆరోగ్యం గురించి ఆయన ఈ వీడియోలో ప్రస్తావించారు. ఎవరూ కూడ ఆందోళన చెందవద్దని ఆయన కోరారు.

also read:తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి కరోనా

ఈ నెల 14వ తేదీన బాజిరెడ్డి గోవర్ధన్ భార్యకు కూడ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ సమయంలో ఆమెకు కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది.
తాజాగా ఆమెకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది.  దీంతో అధికారులు ఆమెను క్వారంటైన్ లో ఉండాలని కోరారు. 

బాజిరెడ్డి గోవర్ధన్ కంటే ముందే జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కూడ కరోనా సోకింది. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భార్యతో పాటు వంట మనిషి, డ్రైవర్ కు కూడ కరోనా సోకిన విషయం తెలిసిందే.నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు ఈ నెల 15వ తేదీన కరోనా సోకింది. ఆయన కూడ చికిత్స తీసుకొంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!