బంగారు తెలంగాణకు బహుదూరపు బాటసారి: కేసీఆర్‌కు... ధర్మపురి అర్వింద్ బర్త్ డే విషెస్

Siva Kodati |  
Published : Feb 17, 2021, 02:21 PM IST
బంగారు తెలంగాణకు బహుదూరపు బాటసారి: కేసీఆర్‌కు... ధర్మపురి అర్వింద్ బర్త్ డే విషెస్

సారాంశం

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున బర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు కేసీఆర్‌కు విషెస్ చెప్పారు

తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున బర్త్ డే గ్రీటింగ్స్ వెల్లువెత్తుతున్నాయి.

ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులు కేసీఆర్‌కు విషెస్ చెప్పారు. తాజాగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ముఖ్యమంత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘ బంగారు తెలంగాణకు బహుదూరపు బాటసారి..!!, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు..!!, ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను, దీర్ఘాయుష్షుని ప్రసాదించాలని కోరుకుంటున్నానంటూ అర్వింద్ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా తెలియజేశారు. 

అంతకుముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. "తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘకాలం ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా" అంటూ ప్రధాని ట్వీట్ చేశారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్