కారణమిదీ: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కి హైద్రాబాద్ పోలీసుల నోటీసులు

By narsimha lodeFirst Published Feb 17, 2021, 1:34 PM IST
Highlights

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైద్రాబాద్ పోలీసులు బుధవారం నాడు నోటీసులు  ఇచ్చారు.

హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు హైద్రాబాద్ పోలీసులు బుధవారం నాడు నోటీసులు  ఇచ్చారు.ఎన్నికల సమయంలో ఉపయోగించిన బుల్లెట్ ప్రూప్ వాహానానికి డబ్బులు చెల్లించాలని  ఆ నోటీసులో పోలీసులు కోరారు. ఈ డబ్బులను వెంటనే చెల్లించాలని కోరారు. 

పోలీసులు పంపిన నోటీసులపై  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఎన్నికల సమయంలో పోలీసులే వాహనాన్ని సమకూర్చారన్నారు. ఇప్పుడేమో డబ్బులు కట్టాలని  నోటీసులు ఇచ్చారని రాజాసింగ్ చెప్పారు.తనకు కేటాయించిన బుల్లెట్ ప్రూప్ వాహనంలో అనేక సమస్యలున్నాయని ఆయన చెప్పారు.పోలీసులు వాహనం కేటాయించి ఇప్పుడు డబ్బులు అడగడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ విషయమై పోలీసు అధికారులు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సోషల్ మీడియాను ఉపయోగించుకొని తన అభిప్రాయాలను ఆయన పంచుకొంటున్నారు. మీడియాతో కాకుండా సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. 

దేశంలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై కూడ రాజాసింగ్ సోషలో మీడియా వేదిగా స్పందిస్తున్నారు. 
 

click me!